Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS: అధ్వానంగా ఆర్ధిక పరిస్థితి

–బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 63 వేల కోట్లు ఖర్చు చేయలేదు
–2022-23లో పెట్టిన బడ్జెట్ పై కాగ్ నివేదికలు

BRS:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ లో బీఆర్ఎస్ (brs)ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అధ్వానంగా చేసిం దని కాగ్ (Dani Cog)పేర్కొంది. సరైన అంచనాలు లేకుండా 2022-23 బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని అందులో చెప్పిన మేరకు ఖర్చు చేయలేదని తెలిపిం ది. కేవలం బడ్జెట్ ను (Budget)ఎక్కువగా చూపేందుకు అంకెల గారడీ చేసిందని చెప్పింది. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి, అనే దానిపై ఓ లెక్కా పత్రం లేకుం డా బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసి, చివరకు ఖర్చు చేసింది కొంతే నని పేర్కొంది.

2022-23 ఆర్థిక సంవత్స రంలో రూ.2.77 లక్షల కోట్లతో బడ్జెట్ (bduget)ప్రవేశపెట్టి, ఖర్చు చేసింది రూ.2.14 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. ఓవైపు బడ్జెట్ లో కేటాయింపులు చేసి, ఖర్చు చేయలేదని.. మరోవైపు అసెంబ్లీ ఆమోదం లేకుండానే దాదాపు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. గత ప్రభుత్వ తీరుతో అప్పుల కిస్తీలు, వడ్డీలకు కలిపి పదేం డ్లలో (2023-24 నుంచి 2032-33 వరకు) ఏకంగా రూ.2.67 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పింది.ఆర్థికం (financial)అధ్వానం ఇష్టారీతిన అప్పులు చేయడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని పేర్కొంది. “ఎస్ఆర్ బీఎం పరిధి లోనే కాకుం డా వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అడ్డూఅదుపు లేకుండా అప్పు లు చేసింది. కాళేశ్వరం, మిషన్ భగీరథ కార్పొరేషన్ల కిందనే ఎక్కు వగా అప్పులు తీసుకుంది. కానీ ఆయా ప్రాజెక్టులు పూర్తయిన దాఖలాలు లేవు. సంక్షేమ పథకాల్లోనూ కోతలు పెట్టింది. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళి తబంధు, గొర్రెల పంపిణీ స్కీమ్ లకు పైసా ఇవ్వలేదు. మరికొన్ని స్కీమ్ లకు అరకొరగా నిధులు రిలీజ్ చేసింది” అని కాగ్ తన రిపోర్టులో (report) పేర్కొంది.