BRS:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) నిర్వహించిన బీఆర్‌ఎస్ (brs)కీలక సమావేశానికి నగరానికి చెందిన ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లు డుమ్మా కొట్టగా మరో 15 మంది కార్పొరేటర్లూ గైర్హా జర య్యారు. కండువాల మార్పిడి సీజన్ నడుస్తోన్న సమయంలో ఒకరోజు ముందు సమాచారమిచ్చి నా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లోనే ఉండి కూడా కొందరు ఎమ్మె ల్యేలు (mlas) రాలేదు. శనివారం జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగను న్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) సమావేశం నిర్వహించా రు. గురువారం మధ్యాహ్నమే తల సాని శ్రీనివాస్ యాదవ్ కార్యాల యం నుంచి ఎమ్మెల్యేలు, కార్పొ రేటర్లకు సమావేశానికి రావాలని సమాచారం అందించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (ktr)కూడా హాజరవ్వాలని మొదట అను కున్నా ఢిల్లీ జైలులో ఉన్న కవి త బెయిల్ పిటిషన్‌పై న్యాయవా దులతో చర్చించేందుకు గురువారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. దీంతో శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో సమావేశం జరిగింది. మీటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కొద్ది మందే రావడంతో పలువురు ఎమ్మె ల్యేలు, కార్పొరేటర్లకు ఫోన్లు చేసి మరీ రప్పించారు. కాలేరు వెంకటేష్, సుధీర్‌రెడ్డి ఆలస్యంగా సమావేశాని కి వచ్చారు. మరో ఏడుగురు అసలే రాలేదు. ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీని నిలదీయాలని, ఎమ్మెల్యేలూ కౌన్సి ల్‌కు హాజరు కావాలని శుక్రవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డి ప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డిలపై అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.
అయితే, జీహెచ్ ఎంసీ (ghmc) చట్టం ప్రకారం కౌన్సిల్ కొలు వుదీరిన నాలుగేళ్ల వరకు అవిశ్వా సం పెట్టే అవకాశం లేకపోవడంతో విరమించుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని పరిధిలో బీఆర్‌ఎస్‌కు 14 మంది ఎమ్మెల్యే లున్నారు. వీరిలో ఏడుగురు శక్రవా రం తెలంగాణ భవన్‌లో నిర్వహించి న సమావేశానికి రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 నియోజ క వర్గాలకుగాను 16 బీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender )లోక్‌సభ ఎన్ని కలకు ముందే కాంగ్రెస్‌లో చేరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నంది త అకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరుగగా కాంగ్రెస్ గెలుచుకుంది. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 14కు తగ్గింది. వీరిలోనూ కొందరు కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ధమ య్యారన్న ప్రచారం జరుగుతోంది. శివారు ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యే కు చేరేందుకు కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ (green signal)వచ్చినట్టు సమాచారం. నగరం మధ్యలోని మరో ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతల అభ్యంతరంతో తాత్కాలి కంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే అధికార పార్టీతో పలు వురు ఎమ్మెల్యేలు టచ్‌లోకి వెళ్లి పోయారని, అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తిరగ డం లేదు. పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేక్ తిరుమలలో ఉండగా.. అరెకపూడి గాంధీ సొంత పనిపై నిజామాబాద్‌కు వెళ్లానని పార్టీ నేతలకు సమాచారమిచ్చారు. కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్ బలం 56గా ఉండేది. ప్రస్తుతం 47కు తగ్గింది. కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య బీఆ ర్‌ఎస్, బీజేపీల నుంచి చేరికలతో మూడు నుంచి 19కి పెరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేట ర్లలో ఎంతమంది శనివారం నాటి సమావేశానికి హాజరవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితె తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్), పద్మారావు (సికింద్రాబాద్), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), సుధీర్‌రె డ్డి(ఎల్‌బీనగర్), మాగంటి గోపినా థ్(జూబ్లీహిల్స్), ముఠా గోపాల్ (ముషీరాబాద్), కాలేరు వెంకటే ష్(అంబర్‌పేట) హాజరు కాగా అరెకపూడి గాంధీ(శేరిలింగంపల్లి), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), బండారి లక్ష్మారెడ్డి(ఉప్పల్), మర్రి రాజశేఖర్‌రెడ్డి(మల్కాజ్‌గిరి), కేపీ వివేకానందగౌడ్(కుత్బుల్లాపుర్), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు)లు సమావేశానికి గైర్హాజయ్యారు.