–బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి
Busireddy Foundation: ప్రజా దీవెన, నాగర్జున సాగర్: కాళోజి పుస్తకాలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న విద్యార్థి విద్యార్థు లకు (stuendts) బుసిరెడ్డి ఫౌండేషన్ (Busireddy Foundation) ద్వారా అన్నదాన కార్యక్రమం (Food donation program) నిర్వహిం చారు. గురువారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం పంగవాని కుంట తండా గ్రామంలోని కాళోజి పుస్తకాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన విద్యా ర్థిని, విద్యార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసి రెడ్డి పాండురంగారెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సొసై టీ (Friends Youth Society) ఎమ్.కె.నాయక్ కోరిక మేరకు ముఖ్య అతిథిలుగా పాల్గొన్న మాజీ ఐపిఎస్ సిబిఐ జెడి శ్రీ వి. లక్ష్మీనా రాయణ, సెయింట్ మార్టిన్ ఇన్స్టి ట్యూట్ ఛైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి,శ్రీ బుసిరెడ్డి పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిబిఐ జెడి శ్రీ వి.వి లక్ష్మీ నారాయణ మాట్లాడు తూ గడిచిన సంవత్సర కాలంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్ (Govt School) లో చదివే విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు,నీట్, ఐఐటీ,ఐఐఐటి లో మంచి ర్యాంకు సాధించిన విద్యా ర్థులకు ఆర్థిక సహాయం, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో వాలం టీర్లని పెట్టి నెల,నెలా వాళ్ళకి శాలరీ అందజేస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపా రు. ఈ కార్యక్రమంలో బుసి రెడ్డి ఫౌండేషన్ సభ్యులు,వంగాల భాస్క ర్ రెడ్డి, తేరా అఖిల్ రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.