–నీట్ పేపర్ లీకేజీ కేసులో మొట్ట మొదటి ఎఫ్ఐఆర్
–దర్యాప్తు ముమ్మరం చేసేందుకు తీవ్ర చర్యలకు శ్రీకారం
CBI:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించిన నీట్ (neet) పేపర్ లీకేజీ కేసులో సీబీఐ (cbi)మొద ట్లోనే దూకుడు పెంచింది. కేంద్ర ప్రభుత్వా న్ని ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసు కోవడంతో ఈకేసుపై సీబీఐ దర్యా ప్తునకు కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. మరో వైపు యూజీసీ నెట్ (UGC Net), నీట్ పరీక్షల పేపర్ లీకేజీలకు ప్రధాని మోదీ బాధ్యత వహించా లని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం మొత్తం విద్యావ్య వస్థను మాఫియాకు, అవినీతిప రులకు అప్పగించిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆరోపిం చారు. ఈక్రమంలో కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు కేంద్రం చర్య లు తీసుకుంది. దీంతో నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ మొదటి ఎఫ్ఐఆర్ ను (FIR)నమోదు చేసింది. దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన రెండో రోజు సీబీఐ నీట్ పేపర్ లీకేజీ కేసుపై తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
రాను న్న రోజుల్లో ఈ పేపర్ లీకేజీ ఘటన లో మరింతమంది వ్యక్తులను అరెస్ట్ (AREEST)చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత నీట్ పేపర్ లీకేజీ (NeEt paper leakage)ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో విద్యాశా ఖ మంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించింది. నీట్ పరీక్ష ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం కోల్పో కుండా ఉండేందుకు పేపర్ లీకేజీ ఘటనపై సీబీఐకి అప్పగించాలని కేంద్రప్రభుత్వం (CENTRAL GOVERMENT)నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను పరి రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహరంలో ఏదైనా వ్యక్తి, సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుం టామని ఇప్పటికే కేంద్రప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటన సంచలన రేపడంతో కేంద్రప్రభుత్వం ఎన్డీఏ ప్రస్తుత డైరెక్ట ర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సీనియర్ అధి కారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీగా నియమిం చింది.