–సత్ప్రవర్తన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం
–విడుదలయ్యే వారికి ఉపాధి చూపే అవకాశం
–చర్లపల్లిలో జాబ్ మేళాతో ఎంపిక చేసేందుకు నిర్ణయం
Charlapalli Jail :ప్రజా దీవెన, హైదరాబాద్: క్షణికావేశంలో నేరాలు చేసి జైలు (jail) పాలైన ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సత్ప్రవర్తనతో శిక్ష (Punishment with good behavior) కాలాన్ని పూర్తి చేసుకుంటున్న కొంతమంది ఖైదీలను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఖైదీలకు క్షమా భిక్ష పెట్టేందుకు మార్గం సుగమం కావడంతో కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో మగ్గుతూ సత్ప్ర వర్తన కలిగిన, అనారోగ్యం, వయో భారం తో బాధపడుతున్న ఖైదీలను క్షమా భిక్షపై విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం (State Govt). క్షమాభిక్షపై ప్రభు త్వం పంపిన ప్రతిపాదనలకు గవర్న ర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలి పారు. గత జనవరి 26న జైళ్ల శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల ల్లో ఉన్న వారిలో 231 మంది క్షమా భిక్షకు అర్హులైన ఖైదీలు (prisoners)ఉన్నారు. అందులో గత ఐదు నెలల్లో 20 మంది విడుదలయ్యా రు. మిగిలిన 210 మంది ఈ వారంలో విడుదల కానున్నారు.
వాస్తవానికి గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ (cm revanth reddy)అనంతరం ఖైదీ ల విడుదలపై సోమవారమే ఉత్త ర్వులు వెలువడాల్సి ఉంది. కానీ, క్షమాభిక్షపై జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలకు ఉపాధి కల్పించాలని గవర్నర్ రాధాకృష్ణన్ (Governor Radhakrishnan) సీఎంకు సూ చించారు. దీంతో క్షమాభిక్షపై విడు దలయ్యే ఖైదీలకు ఉపాధి అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ సాయంత్రం 4 గంటలకు జైళ్ల శాఖ ఉన్నతాధికారు లకు ఆదేశాలు అందాయి. ఈ క్ర మంలో క్షమాభిక్షకు ఎంపికైన ఖైదీ లందరినీ బుధవారం చర్లపల్లి జైలు (Charlapalli Jail) కు తరలించనున్నారు. వారికి జాబ్ మేళా నిర్వహించి ఆసక్తి, అర్హత మేరకు వారు ఎక్కడ పనిచేసేందు కు సిద్ధంగా ఉన్నారనేది అధికారు లు తెలుసుకోనున్నారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రో ల్ బంకులతోపాటు డ్రైవర్లు, డేటా ఆపరేటర్లు, ఇతర విభాగాల్లో వారి ఆసక్తి మేరకు ఉపాధి అవకాశం కల్పిస్తారు. అవసరమైన వారికి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి చూపిం చనున్నారు. జాబ్‌మేళా పూర్తయిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఖైదీల (prisoners) విడుదలపై ఉత్తర్వులు జారీ చేయ నున్నారు.