Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mother Dead body: ఆస్థి కోసం అమ్మ శవంతో… కనికరం లేని కన్నపిల్లలు

తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఎక్కడ తమకు దక్కకుండా పోతుం దనే ఆవేదనతో మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచు కుని కన్నపిల్లలు పంచాయితీకి ఎక్కిన విచిత్ర సంఘటన సూర్యా పేట జిల్లాలో చోటుచేసుకుంది.

అంత్యక్రియలు జరపకుండా మృ తదేహంతో మూడు రోజులుగా
జనం ఛీ కొడుతున్నా పట్టించుకోని వైనం
ప్రజా దీవెన, సూర్యాపేట:  తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి(Assets) ఎక్కడ తమకు దక్కకుండా పోతుం దనే ఆవేదనతో మూడు రోజులుగా తల్లి అంత్యక్రియలు చేయకుండా మృతదేహాన్ని ఇంటి ముందే ఉంచు కుని కన్నపిల్లలు పంచాయితీకి ఎక్కిన విచిత్ర సంఘటన సూర్యా పేట జిల్లాలో చోటుచేసుకుంది.
సూర్యాపేట(Suryapet) జిల్లా నేరేడుచర్ల మం డలం కందులవారిగూడెం లక్ష్మమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఓ కుమారుడు చాలా కాలం క్రితమే మృతి చెందగా కూతుళ్ళ వద్దే ఉంటుంది లక్ష్మమ్మ.వీరి కోసం బాగానే ఆస్తులు సంపాదించింది.

అయితే ఈ ఆస్తులే ఆమె అంత్యక్రి యలకు(funeral) అడ్డుగా మారాయి. కొద్ది రోజుల క్రితం తన కూతురు ఇంటికి వెళ్లిన లక్ష్మమ్మ ప్రమాదవశాత్తు జారీ పడింది. దీంతో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మూడు రోజుల క్రితమే మృతి చెందింది. అయితే అనారో గ్యంతో చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందడంతో కొడుకు, కూతు ళ్లు ఆస్తి పంపకాలు పూర్తయ్య వరకు అంబులెన్స్ ను తరలించేది లేదని తేల్చిచెప్పారు.

దీంతో లక్ష్మ మ్మ వద్ద ఉన్న 21 లక్షల రూపా యల్లో ఆరు లక్షలు వైద్య ఖర్చులకు ఖర్చు చేయగా మిగిలిన 15 లక్షల రూపాయలను కొడుకు తీసుకు న్నట్లు తెలుస్తోంది. మృతురాలి వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. పంపకాలు సమా నంగా, సమస్య లేకుండా ముగిసినా అంత్యక్రియలు చేయాల్సిన కొడుకు చివరి క్షణంలో కొర్రీ పెట్టడంతో అంత్యక్రియలు (funeral) నిలిచిపోయాయి. అంత్యక్రియలకు అయ్యే ఖర్చును సమానంగా భరించాలని, అలా జరిగితేనే తలకొరివి పెడతామని తేల్చి చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.

దీంతో అంత క్రియల(funeral) ఖర్చు వివాదం తల్లి అంత్య క్రియలు నిలిచిపోయేలా చేసింది. అంత్యక్రియల ఖర్చు పంచాయతీ కొడుకు, కుమార్తెల మధ్య గొడవకు కారణమైంది, దీంతో అంత్యక్రి యలు ఆగిపోగా ఫ్రీజర్ లోనే లక్ష్మమ్మ మృతదేహం ఉండిపో యింది. కన్న బిడ్డల తీరుపై గ్రామ స్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెడ్ బాడీని ఇంకా అంత్యక్రియలు జరపకుండా ఇంటి వద్ద ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మ మ్మ బతికున్నప్పుడు బాగానే ఉంద ని ఎవరితోనూ మాట పడేది కాద ని, కానీ ఇప్పుడు ఆమె అంత్య క్రియలు కూతుర్లు, కొడుకు వల్లే ఆగిపోవడం బాధగా వుందని తెలిపారు. పెద్దవారు ఎవరైనా వచ్చి లక్ష్మమ్మ అంత్యక్రియలు జరిపించా లని కోరుతున్నారు.

Children fight for Mother dead body