సంచలన సంఘటన, చిత్తూరులో హైటెన్షన్ వాతావరణం
Chittoorfiring: ప్రజా దీవెన, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూ రులో ఉద్రిక్త వాతా వరణం చోటుచేసుకుంది. గాంధీ రోడ్డు లోని లక్ష్మీ సినిమా హాలు సమీపం లోని పుష్ప కిడ్స్ షాపులోకి ఆరుగురు దుం డగులు తుపాకులతో చొర బడ్డారు. లోపలికి వెళ్లగానే యజ మానిపై రాడ్‌తో దుం డగులు దాడి చేశారు. అయితే దుండగుల నుంచి షా పు యజమాని తప్పించుకున్నాడు. అది చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముగ్గుర్ని పట్టుకున్నారు.
మరో ముగ్గురు షాపులో ఉండ గానే స్థానికులు తాళం వేశారు. అ నంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అం దుకున్న పోలీసులు వెంటనే ఘట నాస్థలికి చేరుకున్నారు. అక్కడ మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. షాపు లోపల ఉన్న దుండగుల దగ్గర మరిన్ని ఆయుధాలు ఉండొచ్చని భావించిన పోలీ సులు అక్కడ భారీగా మోహరించారు. ఆ చుట్టుపక్కల వారిని తక్ష ణమే ఖాళీ చేయించి బయటకు పంపించేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులో చొరబడ్డ దుం డగుల ను దోపిడీ దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు. సమీపం లోని ఐడీ బీఐ బ్యాంకులో చోరీ కోసం వచ్చినట్లుగా అనుమానిస్తు న్నారు.