CITU : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మిషన్ భగీరథ కాంటాక్ట్ కార్మికుల 8నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని లేని యెడల సెప్టెంబర్ 26 నుండి నిరవధిక సమ్మె చేస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీ నారాయణ హెచ్చరించారు. తెలంగాణ మిషన్ భగీరథ (Telangana Mission Bhagiratha) కాంట్రాక్ట్ ఎంప్లా యిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం పానగల్లు లోని మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లుకు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ మంచినీటి శుద్ధి కేంద్రాల దగ్గర ఉన్న సబ్ స్టేషన్ల నిర్వహణ కాంట్రాక్టర్ ఎస్.కె ఎలక్ట్రిషన్ కాంట్రాక్టర్ ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని గతంలో నోటీసు ఇవ్వడం జరిగిందని అన్నారు.
వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా, రక్షణ పరికరాలు టార్చిలైట్, బూట్లు, గ్లౌజులు (Wages, PF, ESI accident insurance, protective equipment, torchlight, shoes, gloves) కల్పించడం లేదని అన్నారు. ప్రమాదకరమైన సబ్ స్టేషన్ల పని చేస్తున్న కార్మికులకు కనీస రక్షణ పరికరాలు కల్పించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. నీటి శుద్ధి కేంద్రాలలో ( water treatment plants) పనిచేస్తున్న పంప్ ఆపరేటర్లు నీటి సరఫరా చేస్తున్న లైన్మెన్ లకు మూడు ,నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులందరికీ పెండింగ్ వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ఈనెల 26 నుండి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు ఎస్ ఈ, ఇంజనీర్ అధికారులు, కాంట్రాక్టర్ కార్మిక సంఘాల నాయకుల మధ్య జాయింట్ మీటింగ్ జరిగి ఈనెల 25 నాటికి 8నెలల పెండింగ్ వేతనాలు, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా రక్షణ పరికరాలు కల్పించడానికి అంగీకరించడం జరిగింది. ఒప్పందం అతిక్రమిస్తే 26 నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జంజరాల శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు కుడుతాల సైదులు ఉయ్యాల మురళి బత్తుల వెంకటేశం, హతిరామ్ వెంకటేష్, అరుణ్ కుమార్ సురేష్ నిమ్మలగోటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు