— సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరా రెడ్డి
CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: వాస్త వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను (Contract outsourcing of workers) వెంటనే రెగ్యులర్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు (CITU State Vice Presidents) తుమ్మల వీరా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ మున్సి పల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూని యన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ జిల్లా కలెక్ట రేట్ ముందు ధర్నా నిర్విహించారు. అనంతరం జిల్లా జాయిం ట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం జరి గింది. ఈ సంద ర్భంగా వీరారెడ్డి (VERRA REDDY)మాట్లాడుతూ జీవో నెంబర్ 1037 లో ప్రతిపాదించిన మున్సిపాలిటీ లలో కాంట్రాక్ట్ ఔట్సో ర్సింగ్ సేవల ను థర్డ్ పార్టీ కి అప్ప జెప్పాలని నిర్ణయాలను ఉపసంహ రించుకో వాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ (Contract Outsourcing) ఎన్ ఎమ్ ఆర్ ఫిక్స్డ్ పే కార్మికుల ను పర్మినెంట్ చేయాలని ఆలోపు ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ కార్మికులకు (For Andhra Pradesh Municipal Workers) చెల్లిస్తున్నట్లుగా తెలంగాణలో కూ డా 21వేల వేతనం చెల్లించాలని డి మాండ్ చేశారు పారిశుధ్య సేవలో ప్రైవేటీ కరణ చర్యలు ఉపసం హ రించుకోవాలని రామ్కీ తదితర ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయా లని డిమాండ్ చేశారు కొత్తగా నియమించుకున్న కార్మికులకు పాత కార్మికులతో సమానంగా వేత నాలు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని అన్నారు.
ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని (Insurance scheme) ప్రవేశపెట్టా లని దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ (DEMAND) చేశారు వయసుమీరిన అనారోగ్యం కారణంగా రిటైర్మెంట్ అయిన కార్మికుడికి ఐదు లక్షలు ఇవ్వాలని వారి కుటుంబంలోని వారసులకు అదే ఉద్యోగం కల్పించాలని కోరారు ఆదివారం పండుగ సెలవులు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని వాటర్ వర్క్స్ ఎలక్ట్రిసిటీ కార్మికులకు (Water works for electricity workers) కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇంటి స్థలాన్ని కేటాయించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యద ర్శిలు దండెంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండమల్ల శ్రీనివాస్, నల్లగొండ , చిట్యాల, చండూర్, దేవరకొండ ,అనుముల పట్టణ మున్సిపల్ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పెరిక కృష్ణ, కత్తుల సైదులు, యేసు, తారమ్మ ,కొత్తపల్లి జంగయ్య ఎస్కే జానీ, నరసింహ, వెంకట్ రెడ్డి, నరసమ్మ, శోభ, చంద్రమ్మ ,సైదమ్మ, పద్మ, నాగరాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు