— పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy:ప్రజా దీవన, హైదరాబాద్: ఆషాఢ మాసం సందర్భంగా ప్రజాభవన్ (Praja Bhavan) లోని నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలను (Festivals of bonas) ఘనంగా నిర్వహిసున్నారు. అయితే ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మ వారికి సీఎం, డిప్యూటీ సీఎం బోనం(bonam) సమర్పించుకున్నారు. అనంతరం ప్రజా భవన్ నుంచి.. అబ్దుల్లాపూర్ మెట్‌కు సీఎం రేవంత్ (cm revanth)బయలుదేరి వెళ్లారు. కాటమయ్య రక్ష పథకానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం శ్రీకారం చుట్టనున్నారు.