Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: మద్యం కంపెనీల ఎంపికలో పార దర్శకత ముఖ్యం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. కొత్త కంపెనీల నుంచి దరఖా స్తులను తీసుకునేందుకు నోటిఫికే షన్ జారీ చేసి, కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని ముఖ్య మంత్రి చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో నిబంధ నలకు అనుగుణంగా ఉండాలని అన్నారు.ఎక్సైజ్ శాఖకు సంబంధిం చి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టివిక్రమార్క, ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షించారు.

ఇప్పటికే తెలంగాణ బివరేజెస్ కార్పొరేషన్ (TGBCL) కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సుల భతర వాణిజ్య విధానం అనుసరిం చాలని ఈ సందర్భంగా సీఎం చె ప్పారు.ఆయా కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవా లని, కంపెనీల నాణ్యత ప్రమాణా లు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జర గాలని చెప్పారు.ఇటీవల యునైటె డ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చా రు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహా రాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

హైకో ర్ట్ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ (ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ) నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఏడాదిగా ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు బిల్లు లు చెల్లిస్తుండగా, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను క్రమంగా క్లియ ర్ చేయాలని ముఖ్యమంత్రి ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.