CM Revanth Reddy: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం, పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతలకు సూదిని జైపాల్ రెడ్డి పేరు
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రఖ్యాత పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణ యాలను సీఎం మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా సింగూ రు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యేమ్నాయాలను పరిశీలించేం దుకు టెక్నీకల్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసు కుంది. ఎక్కడ నీటి లభ్యత ఉంది, ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసు కునే వీలుంది ఎక్కడెక్కడ రిజర్వా యర్లు నిర్మించాలి ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసు కునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు.
మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2, ఫేజ్-3 కి కేబినె ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృ ష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.