–సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖులు హాజరు
–గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day)పుర స్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ రాజ్‌భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిం చారు. సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసా ద్‌కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇతర కాంగ్రెస్ నా యకులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, (CM Revanth Reddy, Legislative Council Chairman Gutta Sukhender Reddy, Legislative Assembly Speaker Gaddam Prasad Kumar, Ministers Ponguleti Srinivas Reddy, Uttam Kumar Reddy, Ponnam Prabhakar and other Congress leaders were present. Chief Secretary Shanti Kumari, DGP Jitender, Intelligence Chief Shivdhar Reddy, Hyderabad CP Srinivas Reddy,) ఇతర అధికారులు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా పర్య టనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేరు గా రాజ్‌భవన్‌కు చేరుకున్నా రు. ఎట్ హోం కార్యక్రమంలో (At home programme) పాల్గొ న్నారు. గవర్నర్ జిష్టుదేవ్ వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బీఆ ర్ఎస్ నాయకులు గైర్హాజరయ్యారు. కార్యక్రమానికి వర్షం వల్ల అంతరా యం ఏర్పడింది. వర్షంలోనే గవర్నర్ అతిథుల్ని కలిశారు. వర్షం నీరు కార్యక్రమం జరుగుతున్న ప్రాంగ ణంలోకి వచ్చి చేరడంతో కొందరు అతిథులు కార్యక్రమం ముగియక ముందే అక్కడి నుంచి వెనుదిరి గారు.
జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్క రించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్ దర్బార్ హాల్ (Raj Bhavan Durbar Hall)వద్ద గురువారం ఉదయం జాతీయ జెండా ఆవిష్కరించారు. రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది, గవర్నర్ ముఖ్య సలహాదారు బుర్రా వెంక టేశం, ఇతర అధికారులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జన్మదిన వేడుకలు రాజ్‌భవన్‌లో గురువారం నిరా డంబరంగా జరుపుకొన్నారు. యా దాద్రి వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు.