Piyush Goyal : అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి,అక్రమాల్లో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు
పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్
పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్ పనైపోయింది
రాహుల్ ప్రధాన మంత్రి కల కలగానే మిగిలిపోతుంది
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వాఖ్య
ప్రజా దీవెన, రంగారెడ్డి: తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి,అక్రమాల్లో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush goyal) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమా న్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపిం చారు. పదేళ్లపాటు తెలంగాణలో ప్రజలను దోచుకున్న బీఆర్ఎస్ శకం ముగిసిందని గుర్తించారు. ప్రజా వ్య తిరేక పాలన వల్లే అసెంబ్లీ ఎన్నిక ల్లో ప్రజలు ఆ పార్టీని ఓడించారని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆయా నియో జవర్గాల్లో జరిగిన సోమవారం నామినేషన్ల కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కాంగ్రెసకు, మిత్ర పక్షాలకు మధ్య ఉన్నది దోస్తీ కాదని,పద వుల కోసం జరుగుతున్న కుస్తీ అని విమర్శించారు.
రాహుల్ గాంధీ నాయకత్వం పూర్తిగా బలహీనంగా ఉందని, ఇండియా కూటమి ప్రజల విశ్వాసాన్ని గెలవలేకపోతోందని చెప్పారు. రాహుల్ (Rahul)ఎన్నటికీ ప్రధాని కల కలగానే మిగిలిపోతుoదని వ్యాఖ్యానించారు. అవినీతి, కుటుం బ పాలనకు కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని ఆరోపించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో మంజూరుచేసిన నిధుల్లో 85 శాతం దళారులు దోచుకుంటే 15 శాతమే పేదలకు అందేవని పేర్కొన్నారు.
మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్ల దేశంలోని 25 కోట్ల మంది నిరుపేద లు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని తెలిపారు. మోదీ పాలనలో దారి ద్య్రం తగ్గి, గ్రామీణ ప్రాంతాలు ఆర్థి కంగా అభివృద్ధి దిశగా సాగుతున్నా యని పీయూష్ గోయల్ పేర్కొన్నా రు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి(BJP) కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda visveshwar reddy)పేర్కొన్నారు. చేవెళ్ల లో తన విజయం ఖాయమైం దని తెలిపారు. ప్రజలకు అందుబా టులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సోమవా రం రాజేంద్రనగర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్ని కల రిటర్నింగ్ అధికారికి విశ్వేశ్వర్ రెడ్డి నామినేష న్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ (Nomination)సందర్భంగా నిర్వహిం చిన ర్యాలీలో విశ్వేశ్వర్రెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. కమలం పువ్వును చూపుతూ ఆమె ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీతారెడ్డి మాట్లాడారు. మోదీ నాయకత్వంలో భారతదేశంలో చేసిన అభివృద్ధి మరే దేశంలో చూడలేదన్నారు. చేవెళ్లలో ప్రజల కోసం పనిచేసే నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
Congress ignored welfare of schemes