Tribute: కానిస్టేబుల్ మృతదేహం వద్ద సీపీ నివాళులు
రోడ్డు ప్రమాదంలో మరణించిన సరూర్‌నగర్ మహిళా పీఎస్ కానిస్టేబుల్ పి.ధనుంజయ, మృతదేహానికి సీపీ రాచకొండ డాక్టర్ తరుణ్ జోషి పూలమాల వేసి నివాళులర్పించారు.
అంత్యక్రియలకోసం రూ.70వేలు అందజేత
ప్రజాదీవెన, సరూర్ నగర్: రోడ్డు ప్రమాదంలో మరణించిన సరూర్‌నగర్ మహిళా పీఎస్ కానిస్టేబుల్ పి.ధనుంజయ, మృతదేహానికి సీపీ రాచకొండ డాక్టర్ తరుణ్ జోషి(CP Tarun joshi )పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 70వేలు అందించారు. ఆయనవెంట ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ ఎల్ బి నగర్, కృష్ణయ్య, ఏసీపీ ఎల్ బి నగర్, సురేఖ, ఇన్స్పెక్టర్ సరూర్‌నగర్ మహిళా పీఎస్, సిహెచ్. భద్రారెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, బ్యాచ్‌మేట్స్ తదితరులు పాల్గొన్నారు.
CP Tarun joshi Tributes at Constables Body