–బూచోళ్ళు మెయిల్ ద్వారా రూ. 11.4 కోట్ల నిలువ దోపిడి
— హైదరాబాద్ రాయదుర్గంలో సంఘటన
Cyber hackers:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలోని (Rayadurgam Knowledge City) ఓ ఫార్మాస్యూటిక ల్ కంపెనీకి సైబర్ నేరగాళ్లు (Cyber criminals)రూ .11.40 కోట్టు టోకరా వేశారు.. వివరాలలోకి వెళితే ఈ సంస్థ ఆంకాలజీ, ఆప్తాలమిక్స్, హార్మోనల్ (Oncology, Ophthalmics, Hormonal) ఉత్పత్తుల్ని తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీలో ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ విషయాలకు సంబంధించి సంస్థకు ముడిసరకును సరఫరా చేసే వారి లావాదేవీలు ఆన్‌లైన్‌లో మాత్రమే జరుగుతుంటాయి.
ఇలా ఆన్‌లైన్‌లో డబ్బులు పంపించే ప్రక్రియను ఓ లైఫ్‌సైన్సెస్ సంస్థ (lifesciences company) చూస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే 11న లైఫ్‌సైన్సెస్ సంస్థ పేరిట ఫార్మా కంపెనీకి ఓ మెయిల్ వచ్చింది.తమ సంస్థ బ్యాంకు ఖాతాలు మారాయని, కంపెనీ నుంచి రావాల్సిన సొమ్మును వేరే రెండు బ్యాంకు ఖాతాలకు పంపించాలనేది ఆ మెయిల్ సారాంశం. ఈ మెయిల్ (mail)తమ కంపెనీ లావాదేవీలు చూస్తున్న లైఫ్‌సైన్సెస్ సంస్థ పంపించిందని భావించిన కంపెనీ నిర్వాహకులు.. మెయిల్‌లో సూచించిన ఖాతాలకు 13,67,195 అమెరికన్ డాలర్లను పంపించారు. అయితే అదే నెల 16వ తేదీన ముడిసరకు సరఫరాదారులకు తమకు ఇంకా పేమెంట్ అందలేదంటూ లైఫ్‌సైన్సెస్ సంస్థ నుంచి ఫార్మా కంపెనీకి ఫోన్ వచ్చింది.
మెయిల్‌లో అకౌంట్లు మారాయని, వేరే అకౌంట్ (account) నంబర్లు మీరే ఇచ్చారని, అలా ఇచ్చిన రెండు బ్యాంకు ఖాతాలకు ఐదు రోజుల క్రితమే డబ్బులు పంపించామని కంపెనీ ప్రతినిధులు బదులిచ్చారు. ఇక్కడే అసలు విషయం బయటపడి ఖంగుతిన్నారు. తాము అసలు ఎలాంటి మెయిల్ పంపలేదని లైఫ్‌సైన్సెస్ సంస్థ ప్రతినిధులు చెప్పడంతో ఫార్మా కంపెనీ ప్రతినిధులకు దిమ్మతిరిగింది. ఇదంతా సైబర్ హ్యాకర్లు చేసిన పని అని తెలుసుకున్న కంపెనీ చేసేదిలేక పోలీసులను ఆశ్రయించారు. తప్పుడు మెయిల్ పంపించి ఏకంగా రూ.11.4 కోట్లు తస్కరించినట్లు గుర్తించిన ఫార్మా కంపెనీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశారు. దీనిపై సైబర్ బ్రాంచ్ (cyber branch) దర్యాప్తు ప్రారంభించింది.