–జాతీయ నులిపురుగుల నిర్మూ లన దినోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిం హ
Damodar Rajanarsimha: ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్స వంను పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెం డజోల్ టాబ్లెట్ లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha), రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఆరో గ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవా లని విద్యార్థులకు సూచించారు. పిల్లల శారీరక ఎదు గుదలకు సంబంధించి డీ వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడ తాయ న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య, వైద్య ను అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలకు, ఆసుపత్రుల కు ప్రజలే ఓనర్లరన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామ న్నారు.
ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు స్వయంగా డివార్మింగ్ టాబ్లెట్లను (Deworming tablets) మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ వేశారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వ ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ టాబ్లెట్లను విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పాఠ శాలలో, కళాశాలలో అంగన్వాడి సెంటర్ (Anganwadi Centre) లలో 1వ సంవత్సరం నుండి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు టాబ్లెట్లను అందిస్తు న్నామన్నారు. నేటి నుండి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నమన్నారు.ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ టాబ్లె ట్ వేయించాలని వైద్య ఆరోగ్య కు టుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) పిలుపు నిచ్చారు.ఆరోగ్యం కోసం యోగాను దినచర్యలో భాగం తీసుకోవాలన్నా రు. మన పూర్వీకు లు ఆరోగ్యం కోసం యోగాను వారసత్వం అందిం చారన్నారు. యోగా దినోత్సవం ను (Yoga Day) ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యతో పాటు సంస్కారవంతులు గా ఎదగాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులకు తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్, రాజ్ భవన్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, వాకాటి కరుణ, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, స్థానిక కార్పొరేటర్ విజయ రెడ్డి, వైద్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.