–మంత్రి సమక్షంలో జూడాల ప్రకటన
–సమస్యలను పరిష్కరించి రూ.61 0 కోట్లు విడుదల
–ఉస్మానియా కొత్త భవనాన్నీ నిర్మిస్తాం
–వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
Damodara Rajanarsimha:ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్లు (Telangana State Junior Doctors) సమ్మె ఎట్టకేలకు విరమించారు. గురువారం నుంచి యథావిధిగా విధులకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని జూడాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) సమక్షం లో ప్రకటించారు. దీంతో రెండు రోజులుగా జూడాలు చేస్తున్న ఆందోళనకు తెరపడింది. తెలం గాణ జూనియర్ డాక్టర్ల ఇబ్బందు లను వెంటనే పరిష్కరించామని మంత్రి దామోదర వెల్లడించారు. ఆయన జూడాలతో కలిసి మీడి యాతో మాట్లాడారు. జూడాలు గతంలో రెండు సార్లు స్టైపెండ్ గురించి తమ దృష్టికి తెచ్చార న్నారు. ప్రతిసారి స్టైపెండ్ సమస్య ఎదురవుతున్నట్లు చెప్పారని, గ్రీన్ చానల్ (green channel) ద్వారా చెల్లించాలని, అలా గే మెడికల్ కాలేజీల్లో వసతి భవ నాలు ఏర్పాటు చేయాలని కోరా రని తెలిపారు. వైద్యులకు రక్షణ కావాలని అభ్యర్థించారని మంత్రి చెప్పారు. వారితో జరిగిన చర్చలు ఫలించాయన్నారు.
జూడాల స్టైపెం డ్ కోసం రూ.406 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గాంధీ, ఉస్మానియాలో హాస్టళ్లు (Hostels in Gandhi, Osmania) నిర్మించాలని కోర డంతో అక్కడికి అధికారులను పం పగా వారు హాస్టళ్లు నిర్మించా ల్సిన అవసరం ఉందని తేల్చారని చె ప్పారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టళ్లు, రోడ్డు నిర్మాణం, మరమత్తులకు రూ.121 కోట్లు కేటాయించామని వెల్లడించారు. అలాగే గాంధీ మెడికల్ కాలేజీకి రూ.79 కోట్లు, కాకతీయ మెడికల్ కాలేజీలో (Katya Medical College) రహదారుల పునరుద్ధర ణకు రూ.3.5 కోట్లు కేటాయించి నట్లు తెలిపారు. కేవలం రెండు రోజుల్లోనే జూడాల సమస్యలకు సంబంధించి రూ.610 కోట్లు విడు దల చేశామన్నారు. వెంటనే స్పందించి, నిధులు విడుదల చేసి నందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవన నిర్మాణ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అక్కడ కొత్త భవన నిర్మాణానికి తాము సానుకూలంగా ఉన్నామని చెప్పారు. త్వరలోనే సంచార ఆహార ప్రయోగశాల (మొబైల్ ఫుడ్ ల్యాబ్స్) ల సంఖ్యను పెంచు తామ ని ఫుడ్, డ్రగ్ ల్యాబ్లను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూ, ప్రైవేటు ఆస్పత్రులను జవా బుదారీతనంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి (minister) చెప్పారు. ఇక ఇదే మీడియా సమా వేశంలో పాల్గొన్న జూడాల ప్రతిని ధులు తాము సమ్మె విరమిస్తున్న ట్లు ప్రకటిస్తూ, గురువారం నుంచి విధులకు హాజరవుతామని చెప్పా రు. అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి దామోదరకు శాలువా కప్పి సన్మానించారు.