dengue fever: ప్రస్తుతం వర్షాకాలం (rainy season) ప్రారంభం అయ్యింది. ఈ సీజన్‌లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే అనేక రోగాల భారిన పడవచ్చు.. దీనితో సీజనల్ వ్యాధులతోపాటు డెంగ్యూ వ్యాధి కూడా రావచ్చు. నిజానికి డెంగ్యూ ఆడ ఈజిప్టి (ఏడెస్ జాతి దోమ) దోమల (Mosquitoes) ద్వారా వ్యాపిస్తుంది. అయితే ఈ దోమల జీవితకాలం కేవలం ఒక నెల మాత్రమే. ఈ కాలంలో అవి 500 – 1000 దోమలకు జన్మనిస్తాయి. ఈ దోమలు మూడు అడుగులు మాత్రమే ఎగరగలవు. ఈ కారణంగా అవి మనిషి దిగువ అవయవాలను మాత్రమే టార్గెట్ గా ఉంచుకుంటాయి. ఈ దోమలు (Mosquitoes) కాటేస్తే.. తీవ్రమైన జ్వరంతోపాటు.. పలు సమస్యలు ఎదురవుతాయి. డెంగ్యూ దోమలు కూలర్లు, పూల కుండీలు, పాత కంటైనర్లు లేదా ఇంటి పైకప్పులు, టైర్లు, గుంతలు మొదలైన వాటిలో గుడ్లు పెడుతూ ఉంటాయి. ఒకేసారి ఏకంగా డెంగ్యూ దోమలు 100 – 300 గుడ్లు పెడతాయి. కేవలం 4 రోజుల తర్వాత అవి దోమల రూపంలోకి మారతాయి. దోమల రూపం తీసుకున్న తర్వాత 2 రోజుల్లో ఎగరడం మొదలవుతాయి.
ఇది ఇలా ఉండగా.. డెంగ్యూ దోమ (Dengue mosquito) కుట్టిన వెంటనే డెంగ్యూ లక్షణాలు కనిపించవు. కానీ కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం మనకి కనపడుతుంది. ఈ ఏడిస్ దోమలు కుట్టిన 3 – 5 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం రావడం మొదలవుతుంది. ఈ దోమలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే సంచరిస్తాయి. డెంగ్యూ జ్వరం లక్షణాల విషయానికి వస్తే ..ఏడెస్ జాతి దోమ కాటు వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి డెంగ్యూ.. దీని లక్షణాలు సాధారణంగా ఫ్లూ లాగా ఉంటాయి. కానీ ఇది తీవ్ర రక్తస్రావ జ్వరానికి దారితీయవచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు (docters)తెలియచేస్తున్నారు.. ఇక ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చర్మంపై ఎర్రటి పొక్కులు, కళ్ల కింద నొప్పి, మోకాళ్ల నొప్పులు, వాపులు, దంతాలు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది.
డెంగ్యూ వ్యాధిని ఎలా నివారణ (prevention) చేయాలంటే.. ముందుగా నిద్రపోయేటప్పుడు దోమతెరలను కచ్చితంగా వాడాలి. అలాగే వర్షాకాలంలో ముఖ్యంగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించండి. ఇంకా దోమ కాటును నివారించడానికి బాడీ ఆయిల్ లేదా క్రీమ్ రాసుకోవడం మంచింది. ఇక వేళ మీకు ఈ డెంగ్యూ లక్షణాలు (Symptoms of dengue)కనిపిస్తే వెంటనే డాక్టర్లు దగ్గరుకు వెళ్లడం మంచిది.