Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Dharani Portal: ధరణి పోర్టల్ లో కీలక నిర్ణయం.. ప్రైవేటు సంస్థ‌కు మంగ‌ళం

Dharani Portal: ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: ప్రతిష్టాత్మకమైన ధరణి పోర్టల్‌లోని (Dharani Portal) భూముల రికార్డుల (Land records) నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభు త్వం ప్రైవేట్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్‌ ఫర్మేటిక్స్‌ సెంటర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు బాధ్యతలు పర్యవేక్షించిన ప్రైవేటు కంపెనీ క్వాంటెలాను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఈ ఏడాది మొదటి త్రైమాసి కంతోనే ఈ సంస్థ నిర్వహణ గడు వు ముగిసినప్పటికీ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను రెవెన్యూ శాఖ పొడిగిస్తూ వచ్చింది.

క‌మిటీ రిపోర్టు (Committee report) ఆధారంగానే రేవంత్ రెడ్డి (Revanth Reddy)సీఎం కాగానే ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్ట‌ల్, టీజీటీఎస్‌ ఎండీతో పాటు పలువురు ఐఏఎస్‌లతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ధరణి నిర్వహణను ఎన్‌ఐసీ, టీజీటీఎస్, సీజీసీ సంస్థలకు (NIC, TGTS, CGC institutions)అప్పగించే విషయమై అధ్యయనం చేసిన ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పోర్టల్‌ నిర్వహణను తక్కువ వ్యయంతోనే చేపట్టడానికి ఎన్‌ఐసీ ముందుకు రావడంతో చివరికి దానివైపే మొగ్గు చూపినట్లు సమాచారం. మూడేళ్లు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్య తలను ఎన్ఐసీ చూడనుంది.