Educational institutions Band: ప్రజా దీవెన, కోదాడ: జులై 4న దేశవ్యాప్తంగా జరిగే కేజీ టు పీజీ (pg) వరకు విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని విద్యార్థి యువజన సంఘాల (Student Youth Unions) పిలుపునిచ్చారు పిలుపునిచ్చారు బుధవారం పట్టణంలోని స్థానిక త్రివేణి డిగ్రీ కాలేజీలో (Triveni Degree College) ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం పాల్గొని మాట్లాడారు .నీట్ పరీక్ష పత్రాల లీకేజి మూలంగా 24 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ దోషులను నేటి వరకు శిక్షించకుండా కాలయాపన చేస్తూ చోద్యం చూస్తుందని తెలిపారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యార్డులకు క్షమాపణ చెప్పి నీట్ పరీక్షలను (neet exam) రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జులై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు*నీట్* పేపర్ లీకేజీ (paper leakage) కి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టి ఏ) చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి, కేంద్ర విద్యా శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ (neet) నిర్వహణంలో వివాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ పరీక్షలను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని కోచింగ్ సెంటర్లు పేరుతో కన్సల్టెన్సీల పేరుతో పేపర్ లికేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీ (paper leakage) కి పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్బంగా జులై 4 న జరిగే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చందర్రావు, పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండల్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కోశాధికారి కామల ఉదయ్, డివిజన్ కార్యదర్శి వేణు తదితరులు పాల్గొన్నారు.