Food inspector: డాబాలు రెస్టారెంట్లపై దాడులు
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎన్.హెచ్ 65 హైవే పై గల పలు ధాబాలు, రెస్టారెంట్ల పై శనివారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పి. స్వాతి, మున్సిపల్ కమిషనర్ పి. వీరేందర్ లు ఆకస్మిక దాడులు జరిపారు.
పాల్గొన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, మున్సిపల్ కమిషనర్ వీరేందర్
పరీక్షల నిమిత్తం ఆహార పదార్థాలు ల్యాబ్ కు తరలింపు పలు హోటల్లు సీజ్ …25 వేల జరిమానా
ప్రజా దీవెన నల్గొండ:నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఎన్.హెచ్ 65 హైవే పై గల పలు ధాబాలు, రెస్టారెంట్ల(restaurants) పై శనివారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పి. స్వాతి, మున్సిపల్ కమిషనర్ పి. వీరేందర్ లు ఆకస్మిక దాడులు జరిపారు.తనిఖీలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న వంట గదులను పరిశీలించి పలు హోటళ్లపై 25000 రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా అనుమానిత ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాదులో గల స్టేట్ ఫుడ్ ల్యాబ్ కి పంపించారు.
రిపోర్ట్స్ కల్తీ అని తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్(food inspector) స్వాతి తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం జరిపి పలు హోటలను మున్సిపల్ అధికారులతో కలిసి సీజ్ చేశారు. హోటలలో అపరిశుభ్రత కలిగిన కల్తీ ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
ఇకపై తరచుగా ఆకస్మిక దాడులు కొనసాగుతాయని విక్రయదారులు ముఖ్యంగా హోటల్స్ నడిపేవారు ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని ఆహారాన్ని అందించాలని లేనిచో వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ సిబ్బంది శివ, రమేష్, చొరవతో మున్సిపల్ అధికారులు సుమన్, శ్రవణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Food inspector attacks on restaurants