–నిరుద్యోగుల ఆందోళనకు బాజా ప్తా మద్దతు పలుకుతాం
–పోలీస్ కంచెలు, నిర్బందాలు ఉ ద్యమకాలాన్ని గుర్తు చేస్తున్నాయి
–ప్రజాపాలన అంటున్న రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన
–తెలంగాణ భవన్ మీడియా సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
Gadari Kishore :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అల్లాడుతున్న నిరుద్యోగుల ఆందోళనలకు బిఆర్ఎస్ (brs)సంఘీభావం తెలుపుతుందని ఆ పార్టీ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ (Gadari Kishore) స్పష్టం చేశారు. జీవితం మీద ఆశతో నిరుద్యో గులు చేస్తున్న ఆందోళనకు బాజాప్తా మద్దతు పలుకుతామని చెప్పారు. పోలీస్ కంచెలు, నిర్బం దాలు ఉ ద్యమకాలాన్ని గుర్తు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. బుధ వారం తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) నిర్వ హించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తం గా నిరుద్యోగులు మెగా డిఎస్సి (dsc) వేయమని కోరుతున్నారని, వాళ్ళని అరెస్ట్ చేసి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత గొప్పలకు పోయి ప్రజాపా లన అంటున్న రేవంత్ రెడ్డి నిరంకు శ పాలన సాగిస్తున్నాడని విమర్శిం చారు.నిరుద్యోగులపై (unemployed) ధమనకాండ ప్రదర్శించడమే కాకుండా వారిని అవమానించే విధంగా మాట్లాడుతు న్నడని తెలిపారు.కేటీఆర్, హరీష్ రావులను దీక్ష చేయమంటున్నావు వాళ్ళు తెలంగాణ కోసం వందల కొద్దీ కేసులు ఎదుర్కొని వందల సా ర్లు జైలుకు పోయి వచ్చారని, నువ్వు ఎక్కడ ఉన్నవ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ భావాదరిద్రంలో కొట్టుమిట్టాడు తుందని ఎద్దేవా చేశారు.
విద్యార్థులు (students) తరుపున మేము పోరాటం చేస్తామని,పచ్చకామెర్ల వాడికి లోకమంత పచ్చగా కన్ఫడుతుం దని, రేవంత్ రెడ్డి కి విద్యార్థుల పోరాటం చులకనగా కనబడుతోం దని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో 1: 100 శాతం గా జరుగుతుంది కదా మరి ఇక్కడ ఎందుకు జరగడం లేదని, మీకు చేత కాకపోతే కాలేదని చెప్పండి అంతేకానీ దొంగ సాకులు ,మాటలు మాట్లాడి నిరుద్యోగులను మోసం చేయవద్దని హితవు పలికారు. భారత దేశంలో (The country of India)ఉన్నముఖ్యమం త్రులలో తెలివి తక్కువ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి లాంటి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి సీఎం కావడం మన దౌర్భాగ్యమని, ఇంత పనికి మాలిన పాలన ఏ రాష్ట్రంలో లేదని చెప్పారు.రేవంత్ రెడ్డి పాలన లో రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిం దని, తెలంగాణ ఆగం ఆగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
.