–జిహెచ్ఎంసి ఎన్నికల కోసమే హైదరాబాద్ పై విమర్శలు
–కేంద్ర మంత్రిగా ఇంతవరకు ఏం చేశావో చెప్పాలి
— కేటీఆర్ ఏది మాట్లాడినా దెయ్యా లు వేదాలు వల్లించడమే
GHMC Elections:ప్రజా దీవెన, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వమే హైదరాబాద్ ను నిర్ల క్ష్యం చేసినట్టుగా అభివృద్ధి కుంటూ పడినట్టుగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడటం మానుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హితవు పలికారు. జీహె చ్ఎంసీ ఎన్నికల కోసం రాజకీయం చేయకుండా నగర అభివృద్ధికి సహకరించాల న్నారు. గురువారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి హైదరాబాద్ స్మార్ట్ సిటీ (Hyderabad Smart City)కోసం అమృత్ పథకం నుండి ఒక్క రూపాయి తేలేదని ఆరోపిం చారు. 10సంవ త్సరాల బీజేపీ (bjp) కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి, జీహెచ్ఎంసీ అభివృద్ధికి బీజేపీ చేసింది ఏమైనా ఉందా కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రూపాయి కూడా సహకారం చేయ కుండా గత ప్రభు త్వంతో అంటకాగి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని మండిపడ్డారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్దంగా వచ్చే 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి అయినా తెచ్చారా అని కిషన్ రెడ్డి ని నిలదీ శారు. హైదరాబాద్ ఇమేజ్ కు భం గం కలిగే విధంగా ఉన్న కిషన్ రెడ్డి మాటలు ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్ (hyderabda)అభి వృద్ధికి చేతనైతే సహాయం చేయాలన్నారు. రాజకీ యాలకు అతీతంగా ఇంచార్జి మం త్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడా నికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించడమే
హైదరాబాద్ సమస్యలపై కేటీఆర్ (ktr) మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, బీజేపీ (bjp) పై ఒత్తిడి తెచ్చి గతంలో ప్రత్యేక నిధులు తేలేకపోయాడని, ఇప్పుడు హైదారాబాద్ గురించి మాట్లాడు తున్నాడని పొన్నం ఏద్దేవా చేశారు. భూకబ్జాలు, అక్రమ కట్టడాలతో హైదారాబాద్ ఇలా కావడానికి కారణం కేటీఆర్ (ktr)అని ఆరోపించారు. హైదరా బాద్కు బీజేపీ ఏం చేసింది. బీఆరెస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని కల కోడ్ (Election Code) కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైందంటారని, నిరుద్యో గుల ఆందోళనల వెనకాల ఉండి ఎవరు నడిపి స్తున్నారో గ్రహించాలని, నియామక ప్రక్రియ ప్రారంభమైన తరువాత అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆరెస్ వాళ్లేనని ఆరోపించారు. ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని తాను విద్యార్థి, నిరుద్యోగులను కోరుతున్నాన న్నారు. విద్యార్థి సంఘాల నాయకు లు తమ సమస్య లలో న్యాయ ముంటే మా దృష్టికి తీసుకురండని సూచిం చారు. 10 సంవత్సరాల్లో డీఎస్సీ పోస్టులు వేయనోళ్ళు టెట్ వేయనోళ్లు ఎందుకు రెచ్చగొడుతు న్నారని ప్రశ్నిం చారు. బీఆరెస్కి మహిళలకు ఉచితంగా బస్ ఇవ్వ డం ఇష్టం లేదా అంటే నోరు మూ సుకున్నారని. ఇప్పుడు నిరుద్యోగు లకు ఉద్యోగాలు ఇయ్యడం ఇష్టం లేదా అని ప్రశ్నిస్తున్నామన్నారు.