Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Green card: భారతీయ పిల్లలకు గ్రీన్ కార్డు చురక

–యుక్తవయసులోకి వచ్చిన కార ణంగా అమెరికాలో బహిష్కరణ సమస్య
–చిక్కుల్లో లక్షల మంది యువతీ యువకులు

Green card:ప్రజా దీవెన, వాషింగ్టన్‌: అమెరికా లోని (America)భారత సంతతి యువత దేశ బహిష్కరణ సమస్యలో చిక్కుకు న్నారు. గ్రీన్‌ కార్డుల (Green card) కోసం దశాబ్దా లుగా వేచి ఉన్న వీరంతా ఇప్పటికీ కార్డులు రాకపోవడంతో ఇబ్బందు ల్లో కూరుకుపోయారు. దీంతో అధ్య క్షుడు జో బైడెన్‌ (Joe Biden)ఇప్పుడు చొరవ తీసుకుంటే తప్ప వీరి సమస్య పరి ష్కారమయ్యేలా కనిపించడం లేదు. దాదాపు 2,50,000 మందికి పైగా యువతీ యువకులు ఈ సమ స్యను ఎదుర్కొంటున్నట్టు వైట్‌ హౌ స్‌ మీడియా కార్యదర్శి కరినె జీన్‌ పీర్రే తెలిపారు. వీరందరికీ వయో పరిమితి(21 ఏళ్లు) నిండిపోయిం దని, అమెరికా రికార్డుల ప్రకారం ‘ఆధాపడి జీవించే స్థాయి’ని దాటి పోయారని తెలిపారు.

అయిన ప్పటికీ సంబంధిత యువతీ యువ కులకు ఉపశమనం కలిగేలా చర్య లు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్న ట్టు వివరించారు. చట్టబద్ధంగా వ లస వచ్చిన 2.5 లక్షల మంది యువతీ యువకుల్లో ఎక్కువ మంది భారత సంతతి వారే ఉన్నారు. వీరందరికీ 21 ఏళ్ల వయసు నిండింది. వీరిని ‘డా క్యుమెంట్‌ డ్రీమర్స్‌’గా పేర్కొంటాం. తాత్కాలిక పనివీసాపై తమ తల్లి దండ్రులతో కలిసి అమెరికాకు చేరు కున్నారు’’ అని సెక్రటరీ (Secretary) పేర్కొన్నా రు. కాగా, వయో పరిమితి మీరి పోయిన భారత సంతతి యువతీ యువకులకు తక్షణమే రక్షణ కల్పిం చాలని వలస విధానం, పౌరసత్వం పై ఏర్పాటైన జ్యుడీషియరీ ఉప సంఘం చైర్మన్‌, చట్టసభ సభ్యుడు అలెక్స్‌ పదిల్లా అధ్యక్షుడు జో బైడె న్‌కు విన్నవించారు. అలెక్స్‌ నేతృ త్వంలో 43 మంది చట్టసభ సభ్యు లు జూన్‌ 13నే ఈ సమస్యను అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లారు. ‘‘వీరంతా మన దేశంలో పెరిగిన వారే. ఇక్కడే చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ పట్టాలు సైతం అందుకున్నారు. ఇలాంటి వారిని గ్రీన్‌ కార్డు (Green card)లేదన్న కారణంగా దేశం నుంచి పంపిచేయడం భావ్యంకా దు. కాబట్టి వారికి రక్షణ కల్పిం చండని చట్టసభ సభ్యులు అధ్య క్షుడికి రాసిన లేఖలో విన్నవిం చారు.