Harish Shankar:బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) దూసుకుపోతున్న సంగతి అందరికి తెలిసందే. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో (pawan kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తీసుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటి వరకు రిలీజ్ (realease) అయిన పోస్టర్స్, గ్లింప్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌కు కాస్త్ బ్రేక్ ఇచ్చాడు అనే చెప్పాలి. మరోవైపు డైరెక్టర్ హరీశ్ శంకర్ మాస్ మహారాజా రవితేజతో (raviteja) మిస్టర్ బచ్చన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్య శ్రీ హీరోయిన్ గా కనపడ పోతుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఈ ముద్దుగుమ్మ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad)నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి క్యూరియాసిటీ బాగా పెరిగింది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ (shooting)శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
యూట్యూబ్ లోసితార్ అంటూ సాగే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే దూసుకుపోతుంది. అలాగే పాటలోని లిరిక్స్ కూడా శ్రోతలను కేసుల అందరిని బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పాటలో రవితేజ, హీరోయిన్ భాగ్య శ్రీ కెమిస్ట్రీ.. బ్యూటీఫుల్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ అందరు కూడా బాగా ఫిదా (fidda) అవుతున్నారు. ఇది ఇలా ఉండగా మరో వైపు సాంగ్ బాగుందంటూ కామెంట్స్ వస్తుండగా.. మరి కొందరు నెటిజన్స్ మాత్రం భిన్నంగా రియాక్ట్ (react) అవుతున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్లను కేవలం వస్తువులాగే చూపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నెటిజన్ సితార్ (sitar) పాటపై రియాక్ట్ అవుతూ.. 56 ఏళ్ల రవితేజతో (raviteja) కేవలం 25 ఏళ్ల హీరోయిన్ భాగ్య శ్రీ స్టెప్పులు వేయడం.. అలాగే హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయడం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే (industry) సాధ్యం అంటూ ట్వీట్దీ చేయగా డైరెక్టర్ హరీశ్ శంకర్ రియాక్ట్ అవుతూ.. “కంగ్రాట్స్.. ఇది నువ్వు కనిపెట్టినందుకు. నువ్వు నోబెల్ ఫ్రైజ్ కు దరఖాస్తు చేసుకో.. అలాగే నువ్వు దీనిని కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ప్రశ్నిస్తూ ఉండాలి. నీలాంటి వారికి ఎప్పుడూ వెల్ కమ్ చెబుతూనే ఉంటాను” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ (Harish Shankar) చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Congratulations for the discovery.. i think you should apply for Nobel Prize… 👍👍
And pls continue objectifying film makers…. We welcome you https://t.co/g6J2pR0NXK— Harish Shankar .S (@harish2you) July 10, 2024