Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Marriage Agreement: తమాషా తారస్థాయికి, భార్యాభర్తలు లిఖితపూర్వక ఒప్పందాలు

Marriage Agreement: ప్రజా దీవెన, బెంగాల్: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు తమ జీవితాంతం గుర్తుండిపోయే వేడుకలు జరుపుకోవడం అనవాయితీ. అయితే, ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం పరిపాటి. అదే సందర్భంలో విందు, చిందులు కార్యక్రమాలకు ఉపక్రమిస్తారు.

అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే పెళ్లి కాని ఓ ప్రేమ జంట చేసుకున్న ఫన్నీ అగ్రిమెంట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భార్యాభర్తలు ఇలాంటి ఒప్పం దాలు కూడా చేసుకుంటారా అని తెలిసిన వారు ముక్కున వేలేసు కుంటున్నారు. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఆ అగ్రి మెంట్‌లోని షరతులు చూస్తే నవ్వు ఆగదు గాక ఆగదు. అసలు విషయం ఏమిటంటే. పశ్చిమ బెంగా ల్‌కు చెందిన అనయ, శుభమ్ అనే దంపతులు పెళ్లయిన రెండేళ్ల తర్వాత ప్రేమికుల దినోత్స వం సందర్భంగా ఈ ఒప్పంద పత్రం రాసుకున్నారు. రూ.500 బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఇందులో అనయ, భర్త శుభమ్‌కు కొన్ని షరతులు విధించింది. భోజనం చేసే సమయంలో కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడాలి. ట్రేడింగ్ గురించి మాట్లాడకూడదు. బెడ్‌రూమ్‌లో స్టాక్ మార్కెట్ లాభ నష్టాల గురించి చర్చించకూడదు. తనను ‘బ్యూటీ కాయిన్’, ‘క్రిప్టో పై’ అని పిలవడం ఆపేయాలి. రాత్రి 9 గంటల తర్వాత ట్రేడింగ్‌కు సంబం ధించిన యాప్స్, వీడియోలు చూడకూడదు అని షరతులు పెట్టింది.

భార్యకు భర్త కొన్ని కండీషన్లు పెట్టాడు. తన ప్రవర్తనపై అమ్మకు ఫిర్యాదు చేయడం మానుకోవాలి. వాద సమయంలో తన పాత ప్రేయసి ప్రస్తావన తీసుకురాకూడదు. ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు కొనకూడదు. రాత్రిపూట స్విగ్గీ, జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేయకూడదు అని షరతులు విధించాడు. ఒకవేళ ఎవరైనా ఈ షరతులను ఉల్లంఘిస్తే మూడు నెలలపాటు బట్టలు ఉతకాలని, టాయిలెట్లు శుభ్రం చేయాలని, ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకురావాలని రాసుకున్నారు. ఈ వినూత్న అగ్రిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.