బక్రీద్ కావడంతో వాహనాలు దారిమళ్లింపు
HYDERABAD TRAFFIC: ప్రజాదీవెన, హైదరాబాద్: నేడు (సోమవారం) బక్రీద్ (BAKRID) పర్వదిదాన్ని జరుపుకునేందుకు ముస్లిం మిత్రులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో (HYDERABAD) ఈరోజు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను (TRAFFIC RISTRICT) విధించారు అధికారులు. హైదరాబాద్‌లోని బక్రీద్ ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. మీర్ ఆలం ఈద్గా ప్రాంతంతో ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ సమయంలో పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే బహదూర్ పురా క్రాస్ రోడ్ మీదుగా అనుమతించనున్నారు. ప్రార్థనల కోసం వచ్చే వారి వాహనాలను నెహ్రూ జూ పార్క్, అల్లాహో అక్బర్ మసీదు ముందు పార్కింగ్ చేసుకోవచ్చని అధికారులు (OFFICERS) తెలిపారు. ఇక బక్రీద్ పండగ నేపథ్యంలో ఓల్డ్ సిటీలోనూ పలు ఆంక్షలు విధించారు. పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో సుమారు 1000 మంది పోలీసులతో (POLICE)బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఇక మరోవైపు ఈరోజు పశువధపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పశువులను తరలించే వాహనాలను తనిఖీ చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల 23 చెక్ పోస్టులు (CHECK POST) అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60కి పైగా చెక్ పోస్టులు పెట్టి ముమ్మరంగా వాహనల తనిఖీలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ (HYDERABAD) సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.