*ఐసెట్ లో త్రివేణి డిగ్రీ కళాశాల విద్యార్థునికి రాష్ట్రస్థాయిలో 62వ ర్యాంక్. బాణాల వసంత.
ICET: ప్రజాదీవెన, కోదాడ: విద్యతో పాటు త్రివేణి డిగ్రీ కళాశాలలో ప్రత్యేక శిక్షణ (TRAINING) అందిస్తున్నట్లు వెంకటరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి అన్నారు ఆదివారం విడుదలైన ఐసెట్ (ICET) (ఎంసీఏ. ఎంబీఏ)పరీక్ష ఫలితాలలో త్రివేణి డిగ్రీ కళాశాలకు చెందిన వీరం రెడ్డి చందన రాష్ట్రస్థాయిలో 62వ ర్యాంకు సాధించారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం చందన ను అభినందించారు అనంతరం విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో వెంకటరెడ్డి విద్యాసంస్థలు స్థాపించినట్లు ఆమె తెలిపారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు అనేక పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు రాష్ట్రస్థాయిలో 62వ ర్యాంకు సాధించిన చందన ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు పోటీ తత్వంతో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని తెలిపారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిరికొండ శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ శివశంకర్ అధ్యాపకులు కాశయ్య లక్ష్మయ్య వెంకటేశ్వర్లు సాజిత్ తదితరులు పాల్గొన్నారు