Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International Yoga Day: ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day: ప్రజా దీవెన నల్లగొండ: యోగా, ప్రాణాయామం సాధన ద్వారా ఆరోగ్యకర జీవనం సాధ్య మవుతుందని  భారత ఆహార సంస్థ నల్గొండ (Nalgonda) డివిజనల్ సుశీల్ కుమార్ సింగ్ (Sushil Kumar Singh)పేర్కోన్నారు. అంత ర్జతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంస్థ ప్రాంగణంలో నిర్వ హించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ యోగా (yoga)కేవలం శారీరక పర మైన స్వస్థత చేకూ ర్చడమేకాక, మానసిక , ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందనీ తద్వా రా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాది స్తుందని పేర్కొన్నారు. ప్రాచీన సమాజం మన ఆధునిక సమా జానికి ఇచ్చిన అత్యంత అమూ ల్యమైన సంపదగా యోగాను అభివర్ణించిన ఆయన ప్రతి ఒక్కరూ యోగా సాధనను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని అభిలషించారు. కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు కామన్ యోగా ప్రోటోకాల్ (Common Yoga Protocol)ప్రకారం యోగా సాధన చేశారు.  కార్య క్రమంలో సంస్థ ఉద్యోగులు రఘు పతి, కృష్ణవేణి, సుమిత్, అజయ్, స్వాతి మరియు యోగా శిక్షకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.