–ఎమ్మెల్యేలు పోచారం, సంజయ్ ని అనర్హులుగా ప్రకటించాలి
–స్పీకర్ ను కోరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: బీఆర్ ఎస్ పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హ త వేటు పడేదాకా విడిచిపెట్టబోమ ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయిం చిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ పై స్పీకర్ తక్ష ణమే చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. తమ పిటిషన్ ను స్వీకరించడానికి స్పీకర్ సమయం ఇవ్వకపోవటంతో తమకు ఉన్న మార్గాల ద్వారా ఆయనకు చేరవే శామని తెలిపారు. తెలంగాణ భవ న్ లో బుధవారం మాజీ ఎమ్మెల్సీలు (mlcs) నారదాసు లక్ష్మణ్ రావు, శ్రీని వాన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు తదితరులతో కలిసి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ (brs party) టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ ని తక్షణమే అనర్హులుగా ప్రకటించాల ని కోరేందుకు తాము స్పీకర్ ను కలి సేందుకు మంగళవారం నుంచి ప్ర యత్నిస్తున్నామని చెప్పారు. తమ కు సమయం ఇచ్చే విషయాన్ని పరి శీలించి చెప్తానని స్పీకర్ ఫోన్ లో సమాధానం ఇచ్చారని తెలిపారు. కానీ మంగళవారం రాత్రి దాకా ఆయన నుంచి పిలుపు రాలేదని చెప్పారు.
తిరిగి బుధవారం కూడా పలుమార్లు స్పీకర్ ను (speaker) కలిసేందుకు ప్రయత్నించగా ఆయన వికారా బాద్ పర్యటనలో ఉన్నట్టు స్పీకర్ ఓఎస్టీ సమాధానం ఇచ్చారని తెలి పారు. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను స్పీకర్ కు ఈ-మెయిల్ చేయటమే కాకుండా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా పంపించామని, శాస నసభ కార్యాలయానికి సైతం తమ పిటిషన్ ను పంపామని వివరించా రు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకా రం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ సభ్యత్వం ర ద్దు కావల్సిందేనని, అప్పటిదాకా విడిచిపెట్టే ప్రసక్తేలేదని జగదీష్ రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ (congress party) తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పార్టీ ఫిరా యింపులకు పాల్పడకుండా పటి ష్టమైన చట్టం తెస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ పాంచా న్యాయ్ ఆయన ఉద హరించారు. కాంగ్రెస్ పార్టీ మ్యాని ఫెస్టోను ఆ పార్టీనే పాటించకపోతే దానికి విలువ ఉంటుందా, అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (jeevan reddy) వంటి వారే ప్రశ్నిస్తున్న అంశాన్ని ఈ సంద ర్భంగా గుర్తుచేశారు. స్పీకర్ తక్షణ మే వారి సభ్యత్వాలను రద్దు చే యాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చు కొనేందు కు తమ పార్టీ అధినేత కేసీఆర్ కం డువా పట్టుకొని ఇల్లిల్లూ తిరగలేద ని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రె స్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యే ల్లో చట్టప్రకారం 2/3 వం తు మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ లో చేరా రని, దానికి దీనికి పోలిక ఉందా అని ప్రశ్నించారు. తమ పార్టీ అధి నేత కేసీఆర్ను కలిసేందుకు ప్రజాప్ర తినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులే కాకుండా ప్రజలూ తం డోపతండాలుగా వెళుతున్నారని చెప్పారు.