Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagan Yadav: 27 న సదర్ సమ్మేళనంను విజయవంతం చేయాలి

–మునుగోడు యాదవ్ సంఘం అధ్యక్షుడు బట్టు జగన్ యాదవ్

Jagan Yadav: ప్రజా దీవెన, మునుగోడు: మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav)ఆద్వర్యంలో ఈ నేల 27 న ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్ నందు ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు యాదవ్ సోద రుల ఆత్మీయతకు సాంస్కృతికి చిహ్నమైన సదర్ వేడుకను ఘనం గా నిర్వహించనున్నారు ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు రాజ్యసభ సబ్యులు అనిల్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav),బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ హాజరుకానున్నారు ఈ వేడుకలో యాదవ్ సోదరులు దున్నపోతుల విన్యాసాలు, యా దవ సోదరుల ఆటపాటల తో ఆస్వాదించనున్నారు కాబట్టి నల్గొం డ జిల్లా మరియు మునుగోడు నియోజకవర్గo నుండి అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కొరారు.

ఈ సంధర్భంగా జగన్ యాదవ్ (Jagan Yadav) మాట్లాడుతూ ఈ సదర్ వేడుక యాదవ్ కుటుం బాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు, పాడి పశువులను గౌరవించే గొప్ప వంశం యాదవ వంశమని, దున్నపోతును యాద వులు తమ ఇంటి పెద్ద కుమారు డిగా భావించి సదర్ సయ్యాటతో యాదవ్ ల కీర్తి ప్రతిష్టతలను (Fame and reputation) ప్రపంచం నలుమూలల వ్యాప్తి చెందాలని సదర్ సమ్మేళనం నీ ప్రతి మండల, జిల్లా కేంద్రం లో నిర్వహించి సదర్ నీ రాష్ట్ర పండుగా గా గుర్తించే విదంగా యాదవ్ సోదరులు ఐక్యతా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు మేకల యాదన్న యాదవ్ గట్టుప్పల్ యాదవ్ సంఘం అధ్యక్షుడు పంకర్ల ఐలయ్య యాదవ్ మునుగోడు యాదవ్ సంఘం అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి యాదవ్ చండూరు యాదవ్ సంఘం అధ్యక్షుడు ఆవుల అశోక్ యాదవ్ నాంపల్లి యాదవ్ సంఘం అధ్యక్షుడు పంగా రామ్మోహన్ యాదవ్ మర్రిగూడ యాదవ్ సంఘం అధ్యక్షుడు వల్లపు సైదులు యాదవ్ రావుల రమేశ్ యాదవ్ ,అంజి యాదవ్ వంగూరి యాదయ్యా యాదవ్ మరియు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.