— నల్లగొండలో టియుడబ్ల్యూజే 143, టియుడబ్ల్యూజే (ఐజేయు) ల ఆద్వర్యంలో జర్నలిస్టుల ధర్నా
Journalists in OU:ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ఉస్మా నియా యూనివర్శిటీలో (Osmania University) నిరుద్యో గుల ఆందోళన కార్యక్రమాన్ని కవ రేజ్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ ప్రతినిధి పై భౌతిక దాడికి దిగిన పోలుసులపై (polcie)చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టియు డబ్ల్యూజే 143, టియుడ బ్ల్యూజే (ఐజేయు) సంఘాల ఆద్వర్యంలో ధర్నా కార్య క్రమం నిర్వహించడం జరిగింది. గురువారం నల్లగొండ పెద్ద గడియా రం కూడలి లో జర్నలిస్టులు (Journalists) రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా టియుడ బ్ల్యూజే 143 జిల్లా అద్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ (Jaya Shankar Goud), టియుడ బ్ల్యూజే (ఐజేయు) జిల్లా అద్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి లు మాట్లాడు తూ ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ చానల్ ప్రతినిధి పై అకారణంగా, అమాను శంగా భౌతికంగా దాడులకు పాల్ప డుతూ చొక్కా గల్లా పట్టుకొని లాక్కె ళ్లడం అప్రజాస్వామికమని వ్యాఖ్యా నించారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ నే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు, పాలకులకు వారధిగా నిలిచే జర్నల స్టులపై పోలిసులు అకారణంగా దాడి చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉస్మానియా యూని వర్సిటీలో ((Osmania University)) నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేసేం దుకు వెళ్లిన జీటీవీ ప్రతినిధి శ్రీ చరణ్ పై పోలీసులు అమానుషంగా ప్రవ ర్తించడం సిగ్గుచేటన్నారు. చొక్కా పట్టుకుని లా క్కెళ్లడమే కాకుండా, కెమెరాలను తీయొద్దంటూ బెది రించడం దారుణ మన్నారు. పోలీసులు (police) అత్యు త్సాహం ప్రదర్శిస్తూ జర్నలిస్టుల పట్ల దాడులకు పాల్పడడం రాష్త్రం లో ఎక్కడో అక్కడ అడపాదడపా జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించా ల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులపై (Journalists) దాడులకు పాల్పడిన పోలీసుల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతి నిధి సల్వాది జానయ్య, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జూలకంటి అశోక్ రెడ్డి, వరాకాంతం కిరణ్ కుమార్, కోటగిరి రామకృష్ణ, వెంక ట్ రెడ్డి, దోటి శ్రీనివాస్, జర్నలిస్టు లు దండంపెల్లి రవి, రామ కృష్ణ, గాదె రమేష్, వీరస్వామి, మల్లేష్, వీరలాల్, సలీం, శంకర్, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.