–సైకిల్ పై వచ్చిన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు
–పార్లమెంట్ వద్ద పెళ్లిరోజు ఆస క్తికర సంఘటన
ప్రజాదీవెన, ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల (Parliament Sessions) తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌కు సైకిల్‌పై చేరుకున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు (Kalishetty Appala Naidu).. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు అప్పలనాయుడు. ఢిల్లీలో (delhi)తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై (cycle) పార్లమెంట్‌కు చేరుకున్నారు. సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ (Vizianagaram MP) మొదటి రోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్‌పై చేరుకున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు 15 లక్షల 68 వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఓ సాధారణ వ్యక్తిలా ఇలా సైకిల్‌పై లోక్‌సభకు చేరుకున్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు (Kalishetty Appala Naidu) భారీ మెజార్టీతో విజయం (victory) సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి 2 లక్షల 29 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.