Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalki 2898 AD: కల్కి కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Kalki 2898 AD: తాజాగా ప్రభాస్ (Prabhas) హీరో గా ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‍గా దూసుకుపోతున్న సినిమా కల్కి 2898 ఏడి (Kalki 2898 AD). ఈ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (NAGA ASHWIN) రూపొందించిన సంగతి అందరికి తెలిసిన విషయమే . ఈ సినిమా చుసిన అడియన్స్ (AUDIANS) ఆశ్చర్యపోతున్నారు . కలియుగాంతానికి.. మహా భారతానికి లింక్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్, ట్విస్టులు, ఊహించని పాత్రలకు అడియన్స్ బాగా ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్, ప్రభాస్ (Amitabh, Prabhas) మధ్య వచ్చే సీన్స్, క్లైమాక్స్ గూస్ బంప్స్ అనే వార్తలు వినపడుతున్నాయి . ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రాల్లో ది ది బెస్ట్ మూవీ అంటూ.. నాగ్ అశ్విన్ విజన్ వేరెలెవల్ అని అడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా రూ.600 కోట్లతో నిర్మించగా మొదటి రోజే రూ.180 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి అంటే నమ్మండి. బాహుబలి1,2 సినిమా రేంజ్ లో హిట్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్.

ఇదిలా ఉంటే మరో వైపు ప్రభాస్ రెమ్యునరేషన్ (Prabhas Remuneration) గురించి ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఈ సినిమాకు అత్యధికంగా రూ.150 కోట్లు పారితోషికం తీసుకున్నాడని ముందు నుంచి వార్తలు వచ్చిన ,తాజా నివేదికల ప్రకారం నిజానికి కల్కి 2898 ఏడి సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ (Remuneration) బాగా తగ్గించి కల్కి కోసం ప్రభాస్ కేవలం రూ.80 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే డార్లింగ్ పారితోషికం తగ్గించుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా బయటికి వివరాలు రాలేదు. ఇక మరో వైపు ఈ సినిమా బడ్జెట్ (BUDGET) కోసమే ప్రభాస్ ఇలాచేసి ఉంటారు అని మరి కొందరి అంచనా.

సినిమాల కోసం ప్రభాస్ (PRABASH) తన రెమ్యునరేషన్ (Remuneration) తగ్గించుకోవడం ఇదేమి మొదటిసారి కాదు. 2025లో విడుదల కానున్న రాజాసాబ్ సినిమాకు కూడా తక్కువే పారితోషికం (Remuneration) తీసుకున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు అసలు పారితోషికం తీసుకోవడం లేదని ఫిల్మ్ వర్గాల్లో టాక్ కూడా వినిపిస్తుంది అని సమకాహారం. ఇకపై తనకు రాబోయే సినిమాలకు కూడా ప్రభాస్ తక్కువే పారితోషికం తీసుకోవాలని అనే ఆలోచనలో ఉన్నటు సమాచారం. దీంతో డార్లింగ్ డెసిషన్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ చిత్రాలకు రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ కల్కి సినిమాకు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)రూ.18 కోట్లు, కమల్ హాసన్ (Kamal Haasan) రూ.20 కోట్లు, దిశా పటానీ (Disha Patani) రూ.2 కోట్లు, దీపికా (Deepika)రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.