Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kalvakuntla Kavitha: కవిత కస్టడీ మళ్ళీ పొడిగింపు

–న్యాయమూర్తి సెలవు కారణంగా 31కి విచారణ వాయిదా

Kalvakuntla Kavitha: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)కేసులో అరెస్టయి.. తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) జ్యుడీషియల్‌ కస్టడీని (Judicial custody)న్యా యస్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీపై విచారణను ఈ నెల 31న చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ కేసులో సీబీఐ సప్లిమెంటరీ చార్జి షీట్‌ను దాఖలు చేయగా అందులో తప్పులు ఉన్నాయని, తనకు బెయిల్‌ (BAIL)ఇవ్వాలని కోరుతూ కవిత ట్రయ ల్‌ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. కాగా, సీబీఐ చార్జిషీట్‌, కవిత బెయిల్‌ పిటిషన్‌ రెండింటిపై ఈ నెల 22న విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.

చార్జిషీట్‌ను (Charge sheet) పరిగణనలోకి తీసుకునే అంశంతో పాటు కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 26 వరకు పొడిగించింది. అయితే శుక్రవారం ట్రయల్‌ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవే జా సెలవులో ఉండడంతో విచారణ మరోసారి వాయిదా పడింది. కవిత జ్యుడీషియల్‌ కస్టడీతోపాటు చార్జిషీ ట్‌ను (Charge sheet) పరిగణనలోకి తీసుకునే అంశం పై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.