Khammampati Shankar: విద్యా రంగ సమస్యలపై రాజులేని పోరాటాలు నిర్వహిస్తాం: ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
Khammampati Shankar: ప్రజా దీవెన కనగల్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కనగల్ మండల 12వ మహాసభ స్థానిక ఆదర్శ పాఠశాలలో నిర్వహించారు మహాసభలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లాఅధ్యక్షా, కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మం పాటి శంకర్* హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గోంగూడ అక్కడే ఉన్నాయని విద్యార్థులకు అందవలసిన స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ మెంట్ బకాయిల విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ విద్యార్థుల పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాకముందుకు రేవంత్ సర్కార్ విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోమద్యం శాఖ మంత్రి వున్నాడు కాని విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదర్శ పాఠశాలలో జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పేద మధ్యతరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజన అందిస్తామని చెప్పి మర్చిపోయిందని అందుకనే గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపారని అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈనెల 19 ,20 తేదీలలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా మహాసభలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం నల్గొండ పట్టణ కేంద్రంలో జరిగే 45వ మహాసభలను జయప్రదం చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో డివైఏప్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అక్రమ్ SFI నల్లగొండ డివిజన్ ఉపాధ్యక్షుడు కిరణ్ హారిచందన్, కుమార్,
అభిలాష్,నాని, సుధాకర్, రాకేష్, సిందుజ ,సోని ,మణి ,ప్రశాంత్ , హరిష్ తదితరులు పాల్గొన్నారు