— మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: అమెరికా వెళుతున్నాను, 11వ తేదీ తిరిగొ స్తాను, అమెరికా నుంచి వచ్చేసరికి అది అక్కడుoడొద్దు అంటూ అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkata Reddy). నల్లగొండ జిల్లా కేంద్రం లో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం కు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkata Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నేల మట్టం చేయాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
శనివారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో (At the Municipal Office) సమావేశ మం దిరం నూతన భవన నిర్మా ణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మున్సిపల్ శాఖ నుండి అనుమతి లేకుండా నిర్మించిన బీ ఆర్ఎస్ కార్యాలయాన్ని (BRS office) కూల్చేయా లని గతంలో ఎన్నో సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం బాగాలేదని ఆయన సున్నితంగా కమిషనర్ ను మందలించారు. తాను అమెరికా నుండి వచ్చే లోగా కార్యాలయాన్ని కూల్చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటా నని హెచ్చరించారు. దీంతో నల్లగొం డలో మరోసారి అధికారుల కాంగ్రెస్ ప్రతిపక్ష (Congress is the opposition)బి ఆర్ ఎస్ ల మధ్య రాజకీయ రగడ చోటుచేసుకోనుంది.