Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkata Reddy :నల్లగొండలో నందనవనంగా తీర్చి దిద్దుతా

Komati Reddy Venkata Reddy

–రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన నల్లగొండ: నల్గొండ (nalgonda) పట్టణాన్ని అన్ని రకాలుగా తీర్చి దిద్దడంతో పాటు ఉదయ సము ద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy)అన్నారు. సోమవారం అయన బక్రీద్ సందర్భంగా మునుగోడు రోడ్డు లో ఉన్న ఈద్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల లో పాల్గొన్న అనంతరం పానగల్ ఫ్లై ఓవర్ సర్వీస్ రహదారిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో చేప ట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు ,కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. మ్యాన్ హోల్స్ వద్ద క్యూరింగ్ బాగా చేయా లని, పట్టణానికి డ్రైనేజీ సమస్య లేకుండా, శాశ్వత పరిష్కారం ఉండే లా పనులు చేపట్టాలని ఆదేశించా రు. గత ప్రభుత్వంలో డ్రైనేజీ లైన్ తీయకుండా హడావుడిగా పనులు పూర్తి చేశారని, ఈ డ్రైనేజీ పనులు చేయకపోవడం వల్ల పానగల్ ఫ్లైఓ వర్ వద్ద ఇబ్బందులు తలెత్తాయన్న ఉద్దేశంతో తక్షణమే రూ. 5.5కోట్లు మంజూరు చేయించి భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తి చేయి స్తున్నామని పేర్కొన్నారు.

పట్టణం లో ఎంత వర్షం వచ్చినా చుక్క నీరు నిలవకుండా చేస్తున్నామని, జాతీ య రహదారిని (high ways) పట్టణంలో నుండి తీసుకెళ్లడం ద్వారా రామాలయం, చర్చి, ఆంజనేయస్వామి గుడి, కబరస్తాన్, దేవరకొండ రోడ్ లోని షాపులు వంటివి కోల్పోతున్నా యని, పట్టణం నుండి జాతీయ రహదారి వెళ్లకుండా నల్లగొండ పట్టణం బయట నుండి రూ. 700 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మా ణం చేపడుతున్నామని చెప్పారు. పట్టణంలోకి హెవీ వాహనాలు ఏవి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు పైనుం చి వెళ్లేలా పనులు ప్రారంభించ బోతున్నామని, అందులో భాగంగా నే పానగల్లు వద్ద ఛాయా సోమే శ్వరాలయం సమీపంలో ఇందిరా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇందిరాగాంధీ చౌరస్తాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఉదయ సముద్రాన్ని టూరిజం స్పాటుగా అభివృద్ధి చేస్తామని, చoదనపల్లి వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ లో ట్రీట్మెంట్ ప్లాం టు ఏర్పాటు చేయబోతున్నామని, దేవరకొండ రోడ్ లో ఉన్న సెయింట్ ఆల్ఫన్సెస్ హై స్కూల్ వద్ద ఎస్కలే టర్ తో కూడిన రోడ్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

తద్వారా సుమారు విద్యార్థిని, విద్యార్థులకు రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నివారిస్తున్నామని, దేవరకొండ రోడ్డులో ఉన్న వైయ స్సార్ సర్కిల్ కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నల్లగొండ అవుటర్ రింగ్ రోడ్డు (ring road) కింద భూ ము లు, ఇండ్ల స్థలాలు కోల్పోయే వారికి మార్కెట్ రేట్ ప్రకారం పరి హారం అందించడమే కాకుండా, ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాల ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతోపాటు ప్రమాదాలకు కారణమయ్యే చెట్లను తొలగిస్తు న్నామని, మంత్రితో పాటు, పను ల ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కౌన్సిల ర్లుతదితరులు ఉన్నారు.