Krishna Reddy : ప్రజా దీవెన,కోదాడ: జిల్లా హోంగార్డు ఆర్గనైజేషన్ నుండి కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి గురువారం అకాలంగా మృతి చెందారు సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐఏఎస్ ఆదేశాల మేర ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి గురువారం కట్టుకొమ్మ గూడెంలోని కృష్ణారెడ్డి నివాస గృహానికి వెళ్లి పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు .
ఈ సందర్భంగా కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు సమక్షేమం నుండి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఆయన వెంట కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ హోంగార్డ్ ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు