Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lal Krishna Advani: అదుపులో అద్వానీ ఆరోగ్యం

— వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స
–యూరాలజీ వైద్యుల పర్యవేక్షణ లోఎయిమ్స్ వైద్యుల వైద్యం

Lal Krishna Advani:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బీజేపీ అగ్ర నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (Lal Krishna Advani)ఆరోగ్య పరిస్థితి నిలకడతో అదుపులో ఉందని ఎయిమ్స్ ఆసుపత్రి (AIIMS Hospital) వర్గాలు వెల్లడించాయి. ఆయ న్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తు న్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అద్వానీ (advani) వయసు 96 ఏళ్లు కాగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో నే ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపా యి. మూడు నెలల కిందటే కేంద్ర ప్రభుత్వం అద్వానీకి దేశ అత్యు న్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న అద్వానీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ అవార్డుల (awards) కార్యక్రమానికి హాజరుకాలేకపో యారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివా సానికి వెళ్లి పురస్కారాన్ని అందిం చారు.

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (lal krishna advani)ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. వృద్దా ప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్ (AIIMS చేర్చారు. అద్వానీకి యూరాలజీకి సంబంధిం చిన సమస్యలు ఉన్నాయి. యూ రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్ను (Advani Medical Bulletin) ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు. ఎల్ కే అద్వానీ దేశ అత్యున్నత పౌర గౌరవ పుర స్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతర త్నతో సత్కరించారు. ఈ కార్యక్ర మంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనా యుడు కూడా పాల్గొన్నారు. అద్వా నీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన నివాసంలోనే ఆయనకు భారతరత్నను ప్రదానం చేశారు. ఎల్కే అద్వానీ 1927 నవంబర్ 8న అవిభాజ్య భారతదేశంలో, ప్రస్తుత పాకిస్థాన్లోని కరాచీలో జన్మించారు.

సెప్టెంబర్ 12, 1947న పాకిస్థాను విడిచి పెట్టి అతని కుటుంబం భారతదేశానికి వచ్చిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో (inerview) చెప్పారు. లాల్ కృష్ణ అద్వానీకి (lal krishna advani) ఒక కుమార్తె ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు. అద్వానీ కొడుకు, కుతురు ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నా రు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్ నుంచి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. విభజన తర్వాత భారతదేశంలోని ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా అందుకున్నారు. అద్వానీ ఫిబ్రవరి 25, 1965న కమల అద్వానీని వివాహం చేసుకున్నారు. అద్వానీ దేశభక్తి కారణంగా ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపారు. 1947లో దేశానికి స్వాతంత్యం వచ్చినప్పుడు, లాల్ కృష్ణ అద్వానీ ఈ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ఆయన పాకిస్తాన్లో ఉన్నారు. దేశ విభజన తర్వాత కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చి రాజస్థాన్లో సంఘ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సంఘ్ ప్రచారక్ గా చాలా కాలం పనిచేశారు. 1947 నుంచి 1951 వరకు కరాచీ శాఖ ఖా కార్యదర్శిగా, భరత్పూర్, అల్వార్, బుండి, కోట, ఝలావర్లలో ఖా కార్యక్రమాలను నిర్వహించారు.

లాల్ కృష్ణ అద్వానీ రాజకీయ ప్రయాణం (political journey)గురించి మాట్లాడుకుంటే 1951లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్ సంఘ్ స్థాపించిన. ప్పుడు, 1957 వరకు అద్వానీ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత 1973 నుంచి 1977 వరకు జన్ సంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు, ఆయన దాని వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. అద్వానీ 1980 నుంచి 1986 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 1986 నుంచి 1991 వరకు బీజేపీ (bjp)అధ్యక్షుడిగా వర్క్ చేశారు. అద్వా నీ మూడుసార్లు బీజేపీ అధ్యక్షు డిగా, 5 సార్లు లోక్సభ ఎంపీగా, 4 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశా రు. 1977 నుంచి 1979 వరకు తొలిసారిగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో సమాచా ర, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యత లు చేపట్టారు. రాజకీయాల్లో ‘యా త్రల’ సంస్కృతికి నాంది పలికి న నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ. అయోధ్యలో రామమందిరానికి డిమాండ్ ఉధృతంగా ఉన్న సమ యంలో, లాల్ కృష్ణ అద్వానీ గుజ రాత్లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర ప్రారంభించా రు. దీని కారణంగా దేశ రాజకీయా ల్లో హిందూత్వ రాజకీయాలు ఉద్భ వించాయి. కానీ బీహార్ లో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాద వ్ ఆయనను సమస్తిపూర్లో అరెస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత అద్వానీ రాజకీయాల్లో హీరోగా ఎదిగారు.