Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Madhu Yashki: తెలంగాణ పిసిసిగా మధు యాష్కీ కే మద్దతు

–ఆఖరి అంకానికి చేరుకున్న కొత్త అధ్యక్షుని నియామకo చర్చలు
–త్వరలోనే అధికారకంగా వెల్ల డించే అవకాశం

Madhu Yashki:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ పిసిసి (Telangana PCC) కొత్త అధ్య‌క్షుడి నియామ‌క క‌స‌ర‌త్తు చివ‌రి అంకానికి చేరుకుంది. కొత్త అధ్య‌క్షుడి ఎంపిక‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిల్లీలో ఉన్న‌ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూట సీఎం భట్టి విక్రమార్క (CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kuamr reddy), తెలంగాణ కాంగ్రెస్ వ్యవహా రాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ లతో చ‌ర్చిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్ప గించాలనే అనే అంశంపై ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్ర దింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది.

మధుయాష్కి వైపే మొగ్గు.
.
పిసిపి ప‌ద‌వి రేసులో మ‌హేష్ కుమార్ గౌడ్ (mahesh kumar goud), మ‌ధుయాష్కిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇందులో మ‌ధుయాష్కి (Madhu Yashki వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్న‌ట్లు వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.. సామాజిక సమీకరణాలతో పాటు సీనియార్టీ, సమగ్రవంతమైన నాయకుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబె ట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇవాళ కొత్త పీసీసీ పేరు ఖరారు అవుతుందా లేదా ఇంకా టైమ్ పడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.

మంత్రి వర్గ విస్తరణపై సైతం..

అలాగే మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ (congress) ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టులను (Nominated posts) త్వరగా భర్తీ చేసే యోచనలో ఉం ది. ఇక హస్తినలోనే ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చలు జరు పుతున్నారు. కేబినెట్ లో ఒకేసారి ఆరు మంత్రి పదవులు భర్తీ చేయా లా లేదా కొన్నింటిని పెండింగ్ లో ఉంచాలా అన్న దానిపై మంతనాలు సాగుతున్నాయి. ఇక మంత్రి మండలి కూర్పు, కాంగ్రెస్ లో చేరికల అం శం భేటీలో చర్చకు వచ్చినట్లు డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలి పారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు.