Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Encounter: ఛత్తీస్‌గడ్‌లో భారీఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Encounter: ప్రజా దీవెన, ఛత్తీస్‌గడ్‌: భద్రతా బలగాలు మావోయిస్టులను మట్టు పెట్టే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కోలుకోలని ఎదురుదెబ్బ తగులుతోంది. తాజా గా ఛత్తీస్‌గడ్‌లోని నారాయణ పూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.భద్రతా బలగాలకు మా వోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయి స్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. గురు వారంఉదయం నుంచి మాధ్ అట వీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా భద్రతా బలగాలు సెర్చ్ ఆప రేషన్‌లో భాగంగా భారీ ఎత్తున వరుసగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నారు.

గత ఐదురోజుల క్రితం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరి ధిలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మా వోయిస్టుల మృతి చెందినట్లు పోలీ సు వర్గాలు ధృవీకరించాయి. ఆపరే షన్ కగార్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం మొత్తాన్ని భా రీగా భద్రతా బలగాలు నలువై పులా చుట్టుముట్టి వరుసగా ఎన్‌ కౌంటర్లు చేస్తున్నారు.

జనవరి 16న బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావో యిస్టులు ప్రాణాలు కోల్పోగా అగ్ర నేతలు తప్పించుకున్నట్లు బస్తర్ ఐజి పి.సుందర్‌లాల్‌ తెలిపారు. అలాగే జనవరి 21 గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో 16 మంది మావోయి స్టులు మృతి చెందారు. తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లా లోని పామేడు, బాసగూడ, ఊసు రు గంగ పోలీస్‌స్టేసన్ పరిధిల్లోనే ఎక్కవగా సెర్చ్ ఆపరేషన్‌ కొన సాగుతోంది.

తెలంగాణ సరిహద్దు సౌత్ బస్తర్ ప్రాంతంలో మావోయి స్టు సుప్రీం కమాండర్‌గా ఉన్న మడ వి హిడ్మాతో పాటు తెలంగాణ కా ర్యదర్శి ఉన్నట్లు నిఘా వర్గాల నుం చి సమాచారం అందింది. దీంతో భారీగా సెర్చ్ ఆపరేషన్‌ కొనసాగు తోంది. నిత్యం భద్రతాబలాగాలు, మావోయిస్టులకు మధ్య జరుగు తున్న కాల్పులు, ప్రతి కాల్పులతో దండకారణ్యం ఒక యుద్ధ భూమి గా మారిన పరిస్థితి.తెలంగాణ సరి హద్దులో కూడా హైటెన్స్ వాతా వర ణం నెలకొంది.

తెలంగాణ లోకి మావోయిస్టులు రాకుండా ఇక్కడి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. వచ్చే మార్చి 31 నాటికి మావో యిస్టు లను పూర్తిగా నిర్మూలిస్తా మంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన శపథంలో భాగంగా ఆప రేషన్ కగార్ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా వరుసగా ఎన్‌ కౌంటర్లు జరుగుతున్నాయి.