Gopala Mitra: గోపాల మిత్రులకు కనీస వేతనం ఇవ్వాలి
నల్లగొండ జిల్లా గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ కమిటీ సమీక్ష సమావేశం గురువారం జిల్లా అధ్యక్షుడు యల్లంల శంభు లింగం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
తెలంగాణ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్
ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్(Gopalamitra Service Association) కమిటీ సమీక్ష సమావేశం గురువారం జిల్లా అధ్యక్షుడు యల్లంల శంభు లింగం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా పశుసంవర్ధక శాఖలో మారుమూల గ్రామాలలో మనుషులకు సైతం వైద్య సేవలు అందని మారుమూల పల్లెల్లో పశువులకు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
మండల పశు వైద్యాధికారి సలహా సూచనల మేరకు వైద్య సేవలు(Medical services) అందిస్తూ కృత్రిమ గర్భధారణ, పశుగ్రాసాల(animal feed)పై రైతులకు అవగాహన కల్పిస్తూ అధిక పాల దిగుబడికి దోదపడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో గొర్రెలు, మేకలకు పిపిఆర్, హెచ్ ఎస్, బి క్యూ , పాడి, వ్యవసాయం కు ఉపయోగపడే పశువులకు కూడా సామూహిక గాలికుంటు టీకాలు అత్యంత ప్రమాదకరమైన బ్రూస్ ఎల్లోసిస్,ఆంత్రాక్స్ వంటి వ్యాక్సిన్ కార్యక్రమాలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.
అలాంటి గోపాల మిత్రలకు(gopala mithra) కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో 9 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
మొట్టమొదటిసారి వేతనం ప్రవేశపెట్టిది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. కావున ప్రస్తుత ప్రభుత్వం గోపాల మిత్రులకు కనీస వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి కావటి యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శులు నూక మల్లేష్ యాదవ్, లింగారెడ్డి, ప్రచార కార్యదర్శి కోరపాక వెంకట్, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గౌరవ సభ్యులు నరసింహ, చిరుమర్తి వెంకన్న, బిట్ల శ్రీనివాస్ రెడ్డి, గొట్టే శేఖర్, గోపాల మిత్రులు భూతరాజు సైదులు, జగన్, ఎం. శంకర్, రమేష్, , సురేష్ ,భాస్కర్, జాను, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Minimum wages give Gopala Mitra