MLA Balu Naik: ప్రజా దీవెన, చందంపేట : నల్లగొండ జిల్లా చందంపేట మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆవిష్కరించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ తండ్రికి వచ్చిన చిన్న ఆలోచన ఆయనను ప్రపంచ జ్ఞానిగా తీర్చిదిద్దిందని తెలి పారు.అణచివేత, చిన్నచూపు నకు గురైనా అంబేద్కర్ ప్రపంచ దేశా లకు వెళ్లి ఎవరూ సాధించలేని ఉన్నత చదువులు చదివి భారత దేశానికి వచ్చి రాజ్యాంగాన్ని రచిం చి అన్ని వర్గాల మన్ననలు పొందా రన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకో వాలని ఈ దేశంలో ప్రతి వారికి కా వాల్సిన వ్యక్తి అంబేద్కర్ అని, ఒక వర్గం, కులానికి కాదని, అందరి కో సం రాజ్యాంగాన్ని రచించిన మహా మేధావని వారి సేవలను కొనియా డారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా మాత్ర మే కాకుండా, సామాజిక సమాన త్వం మరియు సామాజిక న్యా యం కోసం అహర్నిశలు కృషి చేసి న మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులను అం దించడంలో కీలక పాత్ర పోషిం చిం దని అన్నారు. అంబేద్కర్ చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల దేశంలో బడుగు, బలహీన వర్గాల జీవన ప్ర మాణాలు మెరుగుపడ్డాయని వివ రించారు. డాక్టర్ అంబేద్కర్ జీవి తం ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయక మని, నేటి యువత ఆయన త్యా గాలను స్మరించి సమాజం కోసం పాటుపడాలని సూచించారు. ఆ యన చూపించిన మార్గం దేశ అభి వృద్ధికి మార్గదర్శకమన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, పిఎసి ఎస్ చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాద వ్,డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కా మల్ల వెంకటయ్య గౌడ్, మాజి జడ్పీటిసి బుజ్జి లచ్చిరాము, మాజి ఎంపీపీలు ముత్యాల సర్వయ్య యాదవ్, గోవింద్ యాదవ్, బిక్కు నాయక్,మండల పార్టీ అధ్యక్షులు బాధ్య నాయక్, కృష్ణయ్య, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, మాజీ సర్పం చులు అనంతగిరి,పాప నాయ క్,మల్లా రెడ్డి, రంగయ్య గౌడ్, రమే ష్ నాయక్, కో ఆప్షన్ సభ్యులు సాదిక్, మార్కెట్ కమిటీ డైరేక్టర్ రాజు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయి రాథోడ్, మాజి ఎంపీటీసీ మహా లక్ష్మయ్య, నాయ కులు భరత్ కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొండ్రపల్లి నాగేష్, దళిత సంఘం నాయకు లు,మహిళకు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
