–కేంద్రం ఏం ఇచ్చిందో వివరించేం దుకు మేం సిద్ధం
–గత ప్రభుత్వం చేతకాక ‘ఆర్ఆర్ ఆర్’ను నిర్మించలేదు
–అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లా డే నేతలే లేకుండా పోయారు
–బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటర మణారెడ్డి
MLA Kattipalli Venkataramana Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణ కు కేంద్రం (Center for Telangana)ఏం ఇచ్చిందో జీవోలతో సహా వివరించేందుకు సిద్ధమని బీజే పీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమ ణారెడ్డి (MLA Kattipalli Venkataramana Reddy) సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt)హయంలో వారికి 12 మంది ఎంపీలు ఉన్నారని, అప్పు డు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధు లు ఇచ్చిందో మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు చేతకాక రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడున్న సీఎం రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? అని నిల దీశారు. జీతాలు తీసుకుంటున్న ఎమ్మె ల్యేలు అసెంబ్లీకి రారని, ఇద్దరు నాయకులు మాట్లాడితే మిగతా 60 మంది భజన చేస్తారని విమర్శిం చారు. అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నేతలే లేరని ఆరోపిం చారు. ఎమ్మెల్యేగా అనవసరంగా గెలిచి అసెంబ్లీకి (assembly)వచ్చానని బాధే స్తోందన్నారు. ఎమ్మెల్యేలు బాధ్య తారహితంగా ఉంటున్నారని, తానేం సత్యహరిశ్చం ద్రుడిని కాదని, అంతా అలానే ఉన్నారని విమర్శించారు.