*ఎమ్మెల్యే శంకర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..
ప్రజా దీవెన, కోదాడ: వెలమ కులస్తులను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పలువురు వెలమ కుల అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. శనివారం కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల వెలమ సంఘ నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీగా తరలి వెళ్లి పట్టణపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేనేపల్లి వెంకటేశ్వరరావు, తీగల కరుణాకర్ లు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సంఘ వ్యతిరేక మాటలతో రెచ్చగొట్టే ధోరణితో సమాజంలో కక్షలు పెంచే విధంగా ఎమ్మెల్యే మాట్లాడడం సరైనది కాదన్నారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలను వెలమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
తక్షణమే వెలమ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మునుముందు ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయకుండా ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వేనేపల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తీగల కరుణాకర్ రావు, ఉపాధ్యక్షులు గుండపనేని కొండలరావు, గౌరవ అధ్యక్షులు రౌతు వెంకటేశ్వరరావు, కోశాధికారి నేలవెల్లి శ్రీనివాసరావు, సభ్యులు అమరనేని శేషగిరిరావు,గుండపునేని నాగేశ్వరరావు, పందిళ్ళపల్లి పుల్లారావు, కాచవరపు కృష్ణారావు, గుండపనేని వేణుగోపాలరావు, వేనేపల్లి సత్యనారాయణ, గుండపునేని ప్రభాకర్ రావు, వేనేపల్లి చిన వెంకటేశ్వరరావు, పులిగండ్ల పాపారావు, శ్రీనివాసరావు, తీగల నరసింహారావు , యాదగిరి తదితరులు పాల్గొన్నారు.