MLC Alugubelli Narsireddy: ప్రజాదీవెన, నల్గొండ టౌన్: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలను, ప్రగతి మరియు గౌతమి జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ బాలికల పాఠశాల మరియు బాలుర పాఠశాల, జిల్లా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం(DIET), జిల్లా పారిశ్రామిక శిక్షణా కేంద్రం (ITI), ఉర్దూ పాఠశాలను పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలలో మరియు పాఠశాలలో ఉపాధ్యాయ అధ్యాపకులు ఎమ్మెల్సీ కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ విద్యా రంగా ప్రస్తుత పరిస్థితులు వాటిపై తను ఎమ్మెల్సీ గా చేసిన కృషి వివరించారు.
మోడల్ స్కూల్, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నల్లగొండ నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర, కేజీవిబీ ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారం కోసం ప్రాతినిధ్యాలు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రభుత్వం వెంటపడి సుప్రీంకోర్టులో లాయర్లు నియమించి బదిలీల ప్రక్రియ జరిగేందుకు కృషి, పదివేలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, 50 వేల పైచిలుకు ఉపాధ్యాయుల బదిలీలు సాఫీగా జరిగేందుకు కృషి కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులైజేషన్ కు మద్దతు, ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్ల నియామకం కోసం మండలంలో ప్రస్తావన ఇలా పలు ప్రభుత్వ ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల సాధనలో ముందుండి చేసిన కృషిని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ప్రైవేటు యాజమాన్యంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపకులు పలు సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి తేగా వాటి పరిష్కారానికి తన వంతుగా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి సమస్యల సాధనకు వారు వెంట ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ అధ్యాపక బృందం వారికి మద్దతును తెలియజేశారు.