Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati reddy: మద్యం కుంభకోణంలో నీ బిడ్డ కవిత తీహార్ జైల్లో ఉంది

మద్యం కుంభకోణంలో నీ బిడ్డ కవిత తీహార్ జైల్లో ఉంది.ఏం మొకం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు కేసీఆర్. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పలపాలు చేసినవు.

ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు కేసీఆర్

మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పలపాలు చేసినవు

ముఖ్యమంత్రి కి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే బిఆర్ఎస్ అడ్రస్ గల్లంతు

మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైఉంది

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ఒక్క అవకాశం ఇవ్వండి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తా

ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రజా దీవెన నల్లగొండ బ్యూరో: మద్యం కుంభకోణంలో నీ బిడ్డ కవిత తీహార్ జైల్లో ఉంది.ఏం మొకం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు కేసీఆర్. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పలపాలు చేసినవు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పదేళ్లపాటు ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు చేసి దోచుకున్నావు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే బిఆర్ఎస్ వాళ్ళ అడ్రస్ కూడా ఉండదని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఉండదు. బూర.. గీర నైజాంత. తమ్ముడు కిరణ్ ను గెలిపిస్తే ప్రతాప్ అన్నకు చిన్న తమ్ముడు లాగా ఉంటాడు. గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పై ఉన్నదని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో జనగామ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు.

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బూర నర్సయ్య గౌడ్ గతంలో ఎంపీగా ఉన్నపుడు ఏమి వెలగపెట్టాడని ప్రశ్నించారు.రాష్ట్రాన్ని ప్రాజెక్టుల పేరుతో అప్పులపాలు చేసి దోచుకున్న కేసీఆర్ కి గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు.పార్లమెంట్ ఎన్నికలలో కేంద్రం లో 10 సంవత్సరాలు అధికారం లో ఉండి మోసం చేసిన నయవంచకుడు మోడీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని, బిజెపి పార్టీకి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.

ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం, ఒక బలగం అన్నారు. జనగాం లో మనం ఒడిపోలేదు. దొంగ ఓట్ల పళ్ళ రాజేశ్వర్ రెడ్డి ఏం చేశాడో తెలుసా 20వేల ఓట్లు దొంగ ఓట్లు వేసుకొని గెలిచాడని ఆరోపించారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్య పెరిగింది.కవిత అరెస్టు బిజెపి, బిఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలు.ఒక్కసారి ఆశీర్వదించి నన్ను గెలిపించండి. జనగాం ప్రాంతానికి ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య, తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి నాకు ఈ పార్లమెంట్ నుండి పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పించింది. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ.

10 సంవత్సరాలలో బిజెపి పార్టీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న కె సి ఆర్ ను కూడ ఏమీ చేయలేక పోయారు.వాళ్ళు కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. మళ్ళీ వాళ్లకు ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు.ఒక్కసారి ఆలోచించండి అవకాశం ఇవ్వండి ఎమ్మెల్యేలకు తోడుగా ఉండి కేంద్రంలో నుంచి రావలసిన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాజలింగం, ప్రొఫెసర్ నాగభూషణం, నియోజకవర్గ కోఆర్డినేటర్ భవాని రెడ్డి, బాల లక్ష్మి, రాజారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

MLC Kavitha in Tihar Jail in liquor scam