–వివాదంలో ఏం ఐ ఎం ఎంపీ అసదుద్దీన్ ప్రమాణ స్వీకారం
MP Asaduddin: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం స్వీకారం పూర్తైంది. స్పీకర్ స్థానంలో ఉన్న రాధా మోహన్ సింగ్ (Radha Mohan Singh) తెలంగాణ ఎంపీలతో ప్రమాణం చేయించారు. సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డికే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్‌లు తెలుగులో ప్రమాణం చేయగా ఎంఐఎం పార్టీ ఎంపీ అస దుద్దీన్ (MP Asaduddin) ఓవైసీ ఉర్ధులో ప్రమాణం చేశారు. గడ్డం వంశీ కృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందనరావు, కొం డా విశ్వేశ్వరరెడ్డి, రామసాయం రఘురాం రెడ్డిలు ఆంగ్లంలో ప్రమా ణం చేశారు. ఇక గోడెం నగేష్ మా త్రం హిందీలో ప్రమాణం చేశా రు. అయితే సురేష్ షెట్కర్, రఘు నందన్‌రావు, ఈటల, అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డిలు జై తెలంగాణ (Jai Telangana) అంటూ సభలో నినదించారు. అలా గే ఈటల రాజేందర్ అయితే జై సమక్క సారలమ్మ అని అన్నారు.
ఇక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అయితే జై లక్ష్మీ నర సింహ స్వామిని బిగ్గరగా తలుచు కున్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య జై భద్రకాళి అని, పి. బలరాం నాయక్ జై తుల్జా భవాని అని, అసదుద్దీన్ ఓవైసీ, మల్లురవి, కావ్య, రఘురాంరెడ్డి జై భీం అని నినదించారు.మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ.. జై పాలస్తీన, అల్లాహో అక్బర్ అంటూ తన ప్రమాణాన్ని పూర్తి చేశారు. దీంతో ఓవైసీ వ్యాఖ్య లపై పలువురు కేంద్ర మంత్రుల తో పాటు బీజేపీ సభ్యులు (bjp) తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేశారు. దీంతో సభాప తి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ స్పందించారు. నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (In the general election)తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేరో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నాయి. ఒక స్థానంలో ఎంఐఎం విజయం సాధిం చింది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఖాతా తెరవలేదన్న విషయం విధితమే. లోక్ సభ సమావేశాలు (Lok Sabha Sessions) జూన్ 24న ప్రారంభమైనాయి. ఆ క్రమంలో ఎంపీలు వరుసగా ప్రమా ణం చేస్తున్నారు. అందులోభాగంగా నిన్న ఏపీ ఎంపీల ప్రమాణం జరిగిం ది. రెండోరోజు అంటే నేడు తెలంగా ణ ఎంపీల ప్రమాణం జరిగింది.